-->
IPL 2021 Point Table: నంబర్ 1 స్థానం కోల్పోయిన ధోనిసేన.. అగ్రస్థానంతోపాటు పాయింట్ల పట్టికలో మార్పులు ఎలా ఉన్నాయంటే?

IPL 2021 Point Table: నంబర్ 1 స్థానం కోల్పోయిన ధోనిసేన.. అగ్రస్థానంతోపాటు పాయింట్ల పట్టికలో మార్పులు ఎలా ఉన్నాయంటే?

Ipl 2021 Points Table

IPL 2021 Point Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2021) 50 వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ జట్టు 19.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి సాధించింది. అంబటి రాయుడు హాఫ్ సెంచరీ సాయంతో చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 136 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైనా.. రాయుడు అజేయంగా 55 పరుగులు చేశాడు. లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీలో కూడా పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్ వికెట్లు త్వరగానే కోల్పోయింది. కెప్టెన్ రిషబ్ పంత్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అయితే ఈ విజయంతో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టే నంబర్ వన్ జట్టుగా మారింది. కాగా నేడు IPL 2021 లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాప్ 4 ప్లేస్ కోసం నేడు ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ప్లే ఆఫ్‌లో నిలబడాలంటే మాత్రం కచ్చితంగా ఈ మ్యాచులో గెలవాల్సిన పరిస్థితిలో ఇరుజట్లు తలపడనుండడంతో మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.

అయితే ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ మ్యాచ్‌ తర్వాత పాయింట్ల పట్టికలో మొదటి, రెండు స్థానాల్లో మార్పులు వచ్చాయి. ఢిల్లీ జట్టు 20 పాయింట్లతో తొలిస్థానంలో నిలిచింది. చెన్నై
సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోయి రెండో స్థానానికి చేరుకుంది. ఇక మూడో స్థానంలో కోహ్లీ సేన నిలిచింది. కోల్‌కతా నాల్గవ స్థానంలో నిలిచింది. పంజాబ్ జట్టు ఐదవ స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ టీం ఆరు, ముంబై టీం ఏడో స్థానం, హైదరాబాద్ జట్టు ఎనిమిదవ స్థానంలో ఉంది.

ఐపీఎల్ ప్రతి సీజన్‌లో పాయింట్ టేబుల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందో, పాయింట్ల పట్టికలోని లెక్కల ఆధారంగా తెలిసిపోతుంది. రన్ రేట్, గెలుపు, ఓటమిల తర్వాత పాయింట్ల పట్టికలో ఆయా జట్ల జాతకాలు మారుతుంటాయి. అయితే పాయింట్ల పట్టికలోని మొదటి నాలుగు జట్లు మాత్రమే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తాయి.

ఫైనల్స్‌కు చేరే జట్లు
మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో తన స్థానాన్ని నిర్ధారిస్తుంది. అదే సమయంలో, ఓడిపోయిన జట్టు ఫైనల్ చేరుకోవడానికి మరొక అవకాశం లభిస్తుంది. మూడవ, నాల్గవ స్థానంలో ఉన్న జట్లు తలపడి, ఇందులో విజేతతో తేల్చుకుని ఫైనల్స్ చేరుకుంటుంది.

పాయింట్ల పట్టిక..

ఢిల్లీ క్యాపిటల్స్ – 13 మ్యాచ్‌లు, 10 విజయాలు, 3 పరాజయాలు, 20 పాయింట్లు
చెన్నై సూపర్ కింగ్స్ – 13 మ్యాచ్‌లు, 9 విజయాలు, 4 పరాజయాలు, 18 పాయింట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 12 మ్యాచ్‌లు, 8 విజయాలు, 4 పరాజయాలు, 16 పాయింట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ – 13 మ్యాచ్‌లు , 6 విజయాలు, 7 పరాజయాలు, 12 పాయింట్లు
పంజాబ్ కింగ్స్ – 13 మ్యాచ్‌లు, 5 విజయాలు, 8 ఓటములు, 10 పాయింట్లు
రాజస్థాన్ రాయల్స్ – 12 మ్యాచ్‌లు, 5 విజయాలు, 7 ఓటములు, 10 పాయింట్లు
ముంబై ఇండియన్స్ – 12 మ్యాచ్‌లు, 5 విజయాలు, 7 ఓటములు, 10 పాయింట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ – 12 మ్యాచ్‌లు, 2 విజయాలు, 10 ఓటములు, 4 పాయింట్లు

Also Read: DC vs CSK, IPL 2021: ఉత్కంఠ మ్యాచ్‌లో చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం.. రాణించిన శిఖర్ ధావన్‌..

IPL 2021 DC vs CSK: తడబడ్డ చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఢిల్లీ గెలుపునకు ఎన్ని పరుగులు కావాలంటే.



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3BdmUdB

Related Posts

0 Response to "IPL 2021 Point Table: నంబర్ 1 స్థానం కోల్పోయిన ధోనిసేన.. అగ్రస్థానంతోపాటు పాయింట్ల పట్టికలో మార్పులు ఎలా ఉన్నాయంటే?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel