-->
Gold Price Today: మహిళలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉందంటే..!

Gold Price Today: మహిళలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉందంటే..!

Gold

Gold Price Today: బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. పండగ సీజన్‌లో బంగారం ధరలు పెరుగులు పెడుతున్నాయి. పసిడి, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగులు చేసే వినియోగదారులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిపెడుతుంటారు. దీపావళి సీజన్‌ ముందు అంటే నవంబర్‌ 2న ధంతేరాస్‌ వస్తోంది. ఇందుకు చాలా మంది బంగారం కొనుగోళ్లు చేస్తుంటారు. ఎందుకంటే ఆ రోజు బంగారం కొనుగోలు చేస్తే ఎంతో మంచిదని విశ్వాసం అందుకే మహిళలు ఎంతో కొంత బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇక తాజాగా ధరలు షాకిస్తు్న్నాయి. ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ధరల్లో మార్పులు ఉంటున్నాయి. ప్రస్తుతం దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,740 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,740గా వద్ద కొనసాగుతోంది. తాజాగా సోమవారం (నవంబర్‌ 1న) దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,8500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,740గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,1600 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,770గా ఉంది.

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే బంగారం కొనుగోలు చేసే ముందు ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

November: కస్టమర్లకు అలర్ట్‌.. నవంబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. గుర్తించుకోవాల్సిన విషయాలు ఇవే..

Post Office Franchise: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ బెనిఫిట్‌..

Dhanteras 2021: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌.. మొబైల్స్‌, స్మార్ట్‌ టీవీలపై అదిరిపోయే ఆఫర్లు..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3jT6zEy

Related Posts

0 Response to "Gold Price Today: మహిళలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉందంటే..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel