-->
ICC Awards: టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ జాబితాలో చేరిన ‘ఆ నలుగురు’.. భారత ఆటగాళ్లకు దక్కని చోటు

ICC Awards: టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ జాబితాలో చేరిన ‘ఆ నలుగురు’.. భారత ఆటగాళ్లకు దక్కని చోటు

Icc T20i Player Of The Year

ICC T20I Player of The Year: ఐసీసీ పురుషుల టీ20ఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన నలుగురు ఆటగాళ్లలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, పాకిస్తాన్ వికెట్ కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ చోటు దక్కించుకున్నారు. మిగతా ఇద్దరు ఆటగాళ్లలో శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగా, ఇంగ్లండ్ వికెట్ కీపర్-బ్యాటర్ జోస్ బట్లర్ ఉన్నారు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియన్ జట్టులో భాగమైన మార్ష్ 27 మ్యాచ్‌లలో 36.88 సగటుతో 627 పరుగులు చేశాడు. అలాగే 18.37 సగటుతో ఎనిమిది వికెట్లు తీశాడు. క్యాలెండర్ ఇయర్ మొత్తంలో మార్ష్ పొట్టి ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా తరపున అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడు. ముఖ్యంగా స్పిన్‌కు వ్యతిరేకంగా స్ట్రైక్ రొటేట్ విషయంలోనూ అద్భుతంగా రాణిస్తూ ఆకట్టుకున్నాడు.

“మిచెల్ మార్ష్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో నం.3లో పంపిచడమే టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా సాధించిన విజయంగా గుర్తించవచ్చు. అందుకు బదులుగా ఫినిషర్ లోయర్ డౌన్‌గా ఉండే పాత్రను కేటాయించడం” అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

యూఏఈ, ఒమన్‌లలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో, అతను ఆరు మ్యాచ్‌లలో 61.66 సగటు, 146.82 స్ట్రైక్-రేట్‌తో 185 పరుగులు సాధించాడు. అతను న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో 50 బంతుల్లో 77 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్-విజేత ఇన్నింగ్స్ ఆడాడు.

ఇక పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ రిజ్వాన్ 29 మ్యాచ్‌లలో 73.66 సగటు, 134.89 స్ట్రైక్ రేట్‌తో 1326 పరుగులు సాధించాడు. అతను స్టంప్‌ల వెనుక కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ సమయంలో పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో స్థానంలో నిలిచాడు.

ఈ ఏడాది ప్రారంభంలో లాహోర్‌లో దక్షిణాఫ్రికాపై తన కెరీర్‌లో తొలి టీ20ఐ సెంచరీని సాధించాడు. కరాచీలో వెస్టిండీస్‌పై 87 పరుగుల అద్భుతమైన నాక్‌తో తన ఫామ్‌ను కొనసాగించాడు.

శ్రీలకం బ్యాటర్ హసరంగా 20 మ్యాచ్‌లలో 11.63 సగటు, 36 వికెట్లు తీశాడు. ఈ ఏడాదిలో ఒక అర్ధ సెంచరీతోపాటు 196 పరుగులు చేశాడు. తక్కువ ఫార్మాట్‌లో అత్యుత్తమ స్పిన్నర్‌లలో ఒకడిగా తనను తాను నిరూపించుకున్నాడు. అదే సమయంలో బ్యాట్‌తో సహకారం అందించగల ఆటగాడిగా కూడా తన సత్తా చూపించాడు.

ఏడాది పొడవునా స్థిరమైన ప్రదర్శన కనబరిచిన హసరంగ, టీ20 ప్రపంచ కప్‌లో సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ హ్యాట్రిక్ సాధించాడు. టోర్నమెంట్‌ను 16 వికెట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఐర్లాండ్‌పై 71 పరుగులతో సూపర్ నాక్ ఆడి ఆకట్టుకున్నాడు.

ఇంగ్లండ్ వికెట్ కీపర్ కం బ్యాటర్ బట్లర్ కూడా 14 మ్యాచ్‌లలో 65.44 సగటుతో 589 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. అలాగే బౌలింగ్‌లో 13 వికెట్లు పడగొట్టాడు.

టీ20 ప్రపంచ కప్‌లో బట్లర్ అద్భుతమైన టచ్‌లో ఉన్నాడు. ఎల్లప్పుడూ అతని జట్టుకు అద్భుతమైన ప్రారంభాలను అందించాడు. ఆస్ట్రేలియా, శ్రీలంకలపై సూపర్ నాక్‌లను ఆడి తన సత్తా చూపించాడు. శ్రీలంకపై సెంచరీతో సహా మొత్తం 269 పరుగులతో ఇంగ్లండ్‌ తరుపున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా టోర్నమెంట్‌ను ముగించాడు.

Also Read: IND vs SA: చివరి రోజుకు చేరిన ఫలితం.. విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్.. విదేశాల్లో బుమ్రా స్పెషల్ రికార్డ్..!

IND vs SA: కోహ్లీ భయ్యా.. నువ్వెక్కడున్నా కింగే.. మైదానంలో మళ్లీ స్టెప్పులేసిన టీమిండియా కెప్టెన్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3zbCjev

Related Posts

0 Response to "ICC Awards: టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ జాబితాలో చేరిన ‘ఆ నలుగురు’.. భారత ఆటగాళ్లకు దక్కని చోటు"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel