-->
Coronavirus: కపూర్‌ ఫ్యామిలీలో కరోనా కలకలం.. హీరో అర్జున్‌తో సహా వారు కూడా పాజిటివ్‌..

Coronavirus: కపూర్‌ ఫ్యామిలీలో కరోనా కలకలం.. హీరో అర్జున్‌తో సహా వారు కూడా పాజిటివ్‌..

బాలీవుడ్‌లో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవల కరీనా కపూర్‌తో పాటు పలువురు ప్రముఖులు వైరస్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో అర్జున్‌ కపూర్‌ కొవిడ్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవవాలని కోరాడీ హీరో. అర్జున్‌తో అతని సోదరి అన్షులా కపూర్‌ కూడా మహమ్మారి బారిన పడింది. అలాగే కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకున్న రియా కపూర్‌, ఆమె భర్త కరణ్‌ బూలానీ కూడా కొవిడ్‌ బాధితుల జాబితాలో చేరిపోయారు. ఈ విషయాన్ని రియా సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేసింది. ‘ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ నేను నా భర్త కరోనా బారిన పడ్డాం. ఇది మహమ్మారి స్వభావం. మేమిద్దరం ఐసోలేషన్‌లో ఉంటున్నాం. వైద్యులు సూచించిన మందులు తీసుకుంటున్నాం’ అని రియా పేర్కొంది.

అర్జున్‌ ఇంటినీ సీజ్‌ చేసిన బీఎంసీ..
కాగా అర్జున్‌ ప్రేయసి మలైకా అరోరా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఆమెకు నెగెటివ్‌ అని తేలింది. వీరిద్దరూ ఇటీవల ఓ డిన్నర్‌ డేట్‌కి వెళ్లారని తెలుస్తోంది. ఇక అర్జున్‌ తండ్రి, నిర్మాత బోనీకపూర్‌, హీరో అనిల్‌కుమార్‌లకు కూడా నెగెటివ్‌ అని తేలింది. కాగా కపూర్‌ ఫ్యామిలీలో ఒకేసారి నలుగురికి కరోనా సోకడంతో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా ముంబైలోని అర్జున్‌ కపూర్‌ ఇంటిని సీజ్‌ చేసింది. ఇంటిపరిసరాలన్నింటినీ శానిటైజ్‌ చేసింది. కాగా ఈ హీరో కరోనా బారిన పడడం ఇది రెండోసారి. గతేడాది సెప్టెంబర్‌లో మొదటిసారి కొవిడ్‌కు గురయ్యాడు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Also Read:

Upasana: ఉపాసన కొణిదెలకు అరుదైన గౌరవం.. గోల్డెన్ వీసా అందుకుని గ్లోబల్ సిటిజన్‏గా గుర్తింపు..(వీడియో)

Big Alert: కొత్త ఏడాదిలో షాకివ్వనున్న గ్యాస్ ధరలు? జనవరి 1న కీలక నిర్ణయం..!

Omicron: ఒమిక్రాన్ వేరియంట్ విధ్వంసం.. గత ఏడు రోజుల్లో అక్కడ భారీగా కేసులు నమోదు..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EGeFrk

0 Response to "Coronavirus: కపూర్‌ ఫ్యామిలీలో కరోనా కలకలం.. హీరో అర్జున్‌తో సహా వారు కూడా పాజిటివ్‌.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel