-->
Jio: జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్.. 29 రోజుల ఎక్స్‌ట్రా వ్యాలిడిటీ..

Jio: జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్.. 29 రోజుల ఎక్స్‌ట్రా వ్యాలిడిటీ..

Recharge Plans

Reliance Jio: జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ త్వరలో ముగియనుంది. రూ. 2,545 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అయితే ఇప్పుడు మరో 29 రోజులను యాడ్‌ చేసింది. అంటే అదే ప్యాక్ 365 రోజుల వార్షిక ప్యాకేజీకి వర్తిస్తుంది. రోజుకు 1.5GB డేటాతో పాటు అపరిమిత కాలింగ్, ప్రతి రోజు 100 SMSలను అందిస్తుంది. ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ప్లాన్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది ఎందుకంటే ఇది జనవరి 2, 2022న ముగుస్తుంది. ప్రీపెయిడ్ ప్యాక్‌లు జియో యాప్ దాని అనుబంధ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి అన్ని టెలికాం ఆపరేటర్లు తమ ప్రీపెయిడ్ టారిఫ్‌లను పెంచడంతో మొబైల్ ఫోన్ వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. రిలయన్స్ జియో కూడా తన ప్రీపెయిడ్ నిర్మాణాన్ని సవరించింది ఇది డిసెంబర్ 1, 2021 నుంచి వర్తిస్తుంది. ఇదిలా ఉండగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన డేటా ప్రకారం , ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని కంపెనీ అక్టోబర్ నెలలో 17.6 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను సాధించింది. మొత్తం యూజర్ బేస్ 42.65 కోట్లకు చేరింది.

జియో పెరిగిన రేట్లు ఈ విధంగా ఉన్నాయి..
డిసెంబర్ 1 నుంచి రూ.75 జియోఫోన్ ప్లాన్ ధర రూ.91 అవుతుంది. రూ.129 ప్లాన్ రూ.155కి, రూ.149 ప్లాన్ ధర రూ.179, రూ.199 ప్లాన్ ధర రూ.239, రూ.249 ప్లాన్ ధర రూ.299. రూ.399 ప్లాన్ ధర రూ.479, రూ.444 ప్లాన్ ధర రూ.533, రూ.329 ప్లాన్ ధర రూ.395, రూ.555 ప్లాన్ ధర రూ.666, రూ.599 ప్లాన్ ధర రూ.719, రూ.1,299 ప్లాన్ ధర రూ.1,559 ఉంటుంది. చివరగా, రూ.2,399 ప్లాన్ ధర రూ.2,879.

యాషెస్ సిరీస్ జరుగుతుండగా బాధాకరమైన వార్త.. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మరణించాడు..

Yuvraj singh: అంతరిక్షంలోకి వెళ్లిన యువరాజ్‌ సింగ్‌ బ్యాట్‌.. ఎలాగో తెలుసా..?

PM Modi: ఓమిక్రాన్ సంక్షోభంపై ప్రసంగించిన ప్రధాని మోడీ.. 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3psNQ5L

0 Response to "Jio: జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్.. 29 రోజుల ఎక్స్‌ట్రా వ్యాలిడిటీ.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel