
Crime News: ఉత్తరఖండ్‌లో దారుణం.. అంకుల్ అని పిలిచినందుకు 18 ఏళ్ల యువతిపై దాడి

Crime News:ఉత్తరఖండ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంకుల్ అని పిలిచినందుకు ఓ వ్యక్తి 18 ఏళ్ల యువతిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉధమ్ సింగ్ నగర్ జిల్లా సితార్‌గంజ్ పట్టణానికి చెందిన 18 ఏళ్ల యువతి డిసెంబరు 19న తాను కొనుగోలు చేసిన బ్యాడ్మింటన్ రాకెట్‌లో కొన్ని తీగలు విరిగిపోయినట్లు గుర్తించింది. తర్వాత దానిని మార్చుకోవడానికి ఖతిమా రోడ్‌లో ఉన్న ఓ దుకాణానికి వెళ్లింది. అక్కడ ఆమె 35 ఏళ్లున్న దుకాణదారుడిని అంకుల్ అని పిలిచింది.
దీంతో ఆ వ్యక్తికి పట్టరాని కోపం వచ్చి ఊగిపోయాడు. నన్నే అంకుల్ అని పిలుస్తావా అంటూ ఆ యువతిని అందరు చూస్తుండగానే చితకబాదాడు. దీంతో ఆమె తలకి బలమైన గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి సదరు యువతిని ఆస్పత్రిలో చేర్పించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు మోహిత్ కుమార్‌పై IPC సెక్షన్ 354, సెక్షన్ 323 సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ సంఘటనపై అక్కడున్న స్థానికులు మండిపడుతున్నారు. దేశంలో మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారికి సరైన న్యాయం జరగడం లేదు. ప్రతిరోజు ఎక్కడో చోట వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అందుకే మహిళలు, యువతులు బయటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
యాషెస్ సిరీస్ జరుగుతుండగా బాధాకరమైన వార్త.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మరణించాడు..
Yuvraj singh: అంతరిక్షంలోకి వెళ్లిన యువరాజ్ సింగ్ బ్యాట్.. ఎలాగో తెలుసా..?
PM Modi: ఓమిక్రాన్ సంక్షోభంపై ప్రసంగించిన ప్రధాని మోడీ.. 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3JkEp0c
0 Response to "Crime News: ఉత్తరఖండ్‌లో దారుణం.. అంకుల్ అని పిలిచినందుకు 18 ఏళ్ల యువతిపై దాడి"
Post a Comment