
India Covid-19: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. ఎంతమంది కోలుకున్నారంటే..?

India Corona Updates: దేశంలో కరోనా కేసులు.. క్రమంగా తగ్గుతున్న క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడపుట్టిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. భారత్‌లో ఇప్పటివరకు 422 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. అయితే.. ఇప్పటివరకు 130 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలాఉంటే.. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. ఇటీవల కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నా.. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో (శనివారం) దేశవ్యాప్తంగా 6,987 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 162 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం దేశంలో 76,766 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 575 రోజుల తర్వాత క్రీయాశీల కేసుల సంఖ్య ఈ గణనీయంగా తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.30 శాతానికిపైగా ఉంది. కాగా నిన్న కరోనా నుంచి 7,091 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,42,30,354 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,79,682 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 141.37 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. కాగా.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
Also Read:
Kidnap: గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన.. ఇంటి ముందు చలికాచుకుంటున్న బాలిక.. ఇంతలోనే..
Uttar Pradesh Elections 2022: యూపీ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. రంగంలోకి దిగిన బీజేపీ వ్యూహకర్త..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3elvaP4
0 Response to "India Covid-19: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. ఎంతమంది కోలుకున్నారంటే..?"
Post a Comment