
India Vaccination: వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో అరుదైన రికార్డు సృష్టించిన భారత్.. ఈ నెలలో ఎన్ని డోసులంటే..

India Vaccination: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. చైనాలో పుట్టిన ఈ మాయదారి రోగం ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు విస్తరించింది. రెండు వేవ్‌ల రూపంలో దూసుకొచ్చిన ఈ వైరస్ దేశాలన్నింటినీ బెంబేలెత్తించింది. ప్రపంచాన్ని పెద్దన్నలుగా చెప్పుకునే దేశాలు కూడా కంటికి కనిపించని ఈ వైరస్ ధాటికి చిగురుటాకులా వణికిపోయాయి. వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా క్రమంగా కరోనా ప్రభావం తగ్గుతోంది. దీనికి కారణం కరోనా నిబంధనలు పాటించడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుండడం.
ముఖ్యంగా సుమారు 130 కోట్లకుపైగా జనాభా ఉన్న భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యాక్సినేషన్ ఓ యజ్ఞంలా జరుగుతోంది. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియలో పలు రికార్డులను తిరగరాసిన భారత్ తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ నెలలో ఇప్పటి వరకు ఏకంగా భారత్‌లో 18.38 కోట్ల డోసులు ఇచ్చారు. ఇది గత నెల కంంటే ఎక్కువ కావడం విశేషం. గడిచిన నెల ఆగస్టులో భారత్‌లో 18.74 కోట్ల డోసులు ఇచ్చారు.
అయితే ఈ నెలలో ఇంకా 5 రోజులు మిగిలి ఉండగానే ఈ రికార్డు సొంతం కావడం విశేషం. దీనిని బట్టి చూస్తే ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఇక ఇదిలా ఉంటే ఈ నెలలో సగటున రోజుకు 81.48 లక్షల డోసులు ఇచ్చారు. మే నెలలో ఇచ్చిన వ్యాక్సిన్ల కంటే ఇది 4 రెట్లు అధికం కావడం విశేషం. ఇక దేశంలో ఇప్పటి వరకు 84 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
Also Read: Covid News: దేశంలో థర్డ్ వేవ్ వస్తుందా..? CSIR నిపుణులు ఏమని తేల్చారో తెలుసా..
Saree Controversy: చీరకట్టుకున్నందుకు మహిళకు అవమానం.. జాతీయ మహిళా కమిషన్ సీరియస్
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3zD3ywP
0 Response to "India Vaccination: వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో అరుదైన రికార్డు సృష్టించిన భారత్.. ఈ నెలలో ఎన్ని డోసులంటే.."
Post a Comment