-->
Thailand Flood: వర్షాలు.. వరదలతో వణికిపోతున్న థాయ్‌లాండ్.. భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటూ జనం..

Thailand Flood: వర్షాలు.. వరదలతో వణికిపోతున్న థాయ్‌లాండ్.. భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటూ జనం..

Thailand Floods

భారీ వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. రోజుల తరబడి అక్కడి ప్రజలు ఇంకా బురద నీటిలోనే మగ్గుతున్నారు. భయం గుప్పిట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు అనేక దేశాల్లో బీభత్సం సృష్టించాయి. చైనా, అమెరికా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో కుంభవృష్టి కారణంగా నదులను తలపించాయి నగరాలు. వందమంది ప్రాణాలు బలి తీసుకున్నాయి వరదలు. చైనా, అమెరికాలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ప్రకృతి ప్రకోపంతో విలవిలలాడిన థాయిలాండ్​‌కు మరో వెదర్ వార్నింగ్ వచ్చింది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరద తగ్గుముఖం పడుతోంది. కానీ చాలా లోతట్టు ప్రాంతాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. అసలే కరోనా కాలం. ఆపై భారీ వర్షాలు. వరదతో వచ్చిన బురద కారణంగా థాయ్‌లాండ్‌ ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎందుర్కొంటున్నారు.

కనీసం తాగడానికి మంచినీరు కూడా లేక అల్లడిపోతున్నారు ప్రజలు. వరద నీటినే ఇంటి అవసరాలకు వాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు కరెంటు సరఫరా నిలిచిపోయి అంధకారంలోనే గడుపుతున్నారు చాలా ప్రాంతాల ప్రజలు. వరద నీటిలో చిక్కున్న అనేక ప్రాంతాల ప్రజలు ఇంకా బయటకు వచ్చే వీలు లేకుండా పోయింది. చాలా వరకు రోడ్లపై ఉద్ధృతంగా ప్రవహిస్తుంది వరద నీరు. ఇక్కడ వరదల వల్ల ఇప్పటివరకు ఎనిమిది మంది మృతిచెందారు.

థాయిలాండ్‌లోని 32 ప్రావిన్సుల్లో మొత్తం 2.71 లక్షలకుపైగా ఇళ్లు నీట మునిగాయని చెప్పారు అధికారులు. 14 ప్రావిన్సుల్లో వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్నట్లు వెల్లడిస్తున్నాయి అక్కడి మీడియా సంస్థలు. చారిత్రక నగరమైన ఆయుతాయలోని పలు దేవాలయాలు, కట్టడాలు వరద నీటిలోనే ఉన్నాయి.

వర్షాలు తగ్గి వారం కావోస్తున్నా.. ఇప్పటి వరకు నేల కనిపించడలేదని.. మొత్తం వరద నీరే ఉందని చెబుతున్నారు అక్కడి ప్రజలు.

ఇవి కూడా చదవండి: WhatsApp And Facebook: సేవలను పునరుద్దరించిన ఫేస్‌బుక్‌.. 7 గంటల తర్వాత ఓపెన్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాఫ్‌లు

Pandora Papers: పాండోరా పేపర్స్‌లో ప్రముఖుల రహస్య సంపద గుట్టు రట్టు.. దర్యాప్తుకు సిద్ధమైన కేంద్రం



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3FsjhTQ

Related Posts

0 Response to "Thailand Flood: వర్షాలు.. వరదలతో వణికిపోతున్న థాయ్‌లాండ్.. భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటూ జనం.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel