-->
Covishield Vaccine: ఇటలీ వెళ్లానుకునే ఇండియన్స్‌కి గుడ్‌న్యూస్.. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు అధికారిక గుర్తింపు..

Covishield Vaccine: ఇటలీ వెళ్లానుకునే ఇండియన్స్‌కి గుడ్‌న్యూస్.. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు అధికారిక గుర్తింపు..

Covishield

Covishield Recognised In Italy: మన కోవిషీల్డ్‌ను వివిధ దేశాలు అధికారికంగా గుర్తిస్తున్నాయి. రెండు వ్యాక్సిన్స్‌లు వేసుకున్న వారికి గ్రీన్‌ పాస్ జారీ చేస్తున్నాయి. వ్యాక్సిన్‌ వేసుకున్న ఇండియన్స్‌ ఇక ఇటలీకి దర్జాగా వెళ్లొచ్చు. భారత్‌లో రూపొందించిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఇటలీ అధికారికంగా గుర్తించింది. దీంతో ఈ టీకా రెండు డోసులు తీసుకున్న ఇండియన్స్ ఇప్పుడు ఆ దేశంలో గ్రీన్ పాస్‌ పొందొచ్చు. అక్కడి భారత రాయబార కార్యాలయం ఈ విషయం ప్రకటించింది. జీ- 20 దేశాల ఆరోగ్య మంత్రుల సమావేశం కోసం సెప్టెంబరు మొదటి వారంలో రోమ్‌కు వెళ్లిన సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ.. ఇటలీకి చెందిన రాబర్టో స్పెరాన్జాతో సమావేశమయ్యారు. కొవిషీల్డ్‌కు గుర్తింపు, వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న భారతీయ విద్యార్థుల ప్రయాణాలు వంటి అంశాలపై చర్చించారు.

విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ సైతం సంబంధిత ప్రతినిధులతో వ్యాక్సినేషన్‌ విషయంలో చర్చించారు. మంత్రి నిరంతర ప్రయత్నాలు, విదేశీ వ్యవహారాల అధికారుల చొరవతో.. కొవిషీల్డ్‌కు గుర్తింపు దక్కిందని రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇప్పటివరకు యూరోపియన్ యూనియన్‌కు చెందిన 16 దేశాలు కొవిషీల్డ్‌ను గుర్తించాయి. ఈ గుర్తింపుతో.. ఆ టీకా తీసుకున్న వారు ఈయూ డిజిటల్ కొవిడ్ సర్టిఫికెట్‌ లేదంటే గ్రీన్‌ పాస్ పొందవచ్చు. ఈ పాస్‌ ఉన్నవారికి ఆయా దేశాల్లో ప్రయాణ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. మరోవైపు కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న భారత ప్రయాణికుల క్వారంటైన్‌ విషయంలో ఈ మధ్య తిరకాసు పెట్టిన బ్రిటన్ మళ్లీ తన నిర్ణయాన్ని మార్చింది. తమ సమస్య టీకాతో కాదు, టీకా ధ్రువపత్రంతో అంటూ చెప్పుకొచ్చింది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత జారీ చేసే వ్యాక్సిన్ సర్టిఫికెట్ కనీస ప్రమాణాలుండాలని యూకే ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై భారత ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపింది.

Read Also…   Health: అదే పనిగా కంప్యూటర్‌ చూస్తున్నారా.? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు. వాటి నుంచి బయటపడాలంటే ఈ టిప్స్‌..

India Vaccination: వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మరో అరుదైన రికార్డు సృష్టించిన భారత్‌.. ఈ నెలలో ఎన్ని డోసులంటే..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3zD3BbZ

0 Response to "Covishield Vaccine: ఇటలీ వెళ్లానుకునే ఇండియన్స్‌కి గుడ్‌న్యూస్.. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు అధికారిక గుర్తింపు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel