
WHO: వ్యాక్సిన్ వేయించుకున్నా మాస్క్ ధరించాల్సిందే.. డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్

కరోనా మహమ్మారి ముగిసిపోయిందని, వ్యాక్సిన్ తీసుకున్నవారికి కరోనా వైరస్ సోకదని భావిస్తున్నారని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. కానీ అది తప్పని చెప్పారు. ఐరోపా అంతటా కోవిడ్ -19 కేసుల పెరుగుతున్నాయని పేర్కొన్నారు. టీకా సంబంధం లేకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు. వ్యాక్సిన్‌లు ప్రాణాలను కాపాడతాయి. తీవ్రమైన వ్యాధి, మరణాల ప్రమాదాన్ని మాత్రమే తగ్గిస్తాయని WHO చీఫ్ పేర్కొన్నారు. ” మీరు టీకాలు వేసినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం కొనసాగించాలని చెప్పారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, గుంపులుగా ఉండకపోవడం, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఇళ్ల లోపల బాగా వెంటిలేషన్ ఉంచుకోవాలి” అని టెడ్రోస్ చెప్పారు.
“వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కోవిడ్-19 మహమ్మారిని రాదనే తప్పుడు భద్రతా భావం గురించి మేము ఆందోళన చెందుతున్నాము. టీకాలు ప్రాణాలను కాపాడతాయి, కానీ అవి కరోనాను పూర్తిగా అడ్డుకోవు. ” అని టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ట్వీట్ చేశారు. దక్షిణాఫ్రికా, బోట్స్వానాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ -19 వేరియంట్ గురించి చర్చించడానికి WHO ఈ శుక్రవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. అంతకుముందు, బోట్స్వానాలో 32 వేరియంట్లు ఉన్న కరోనా వైరస్ జాతి కనిపించడంపై UK శాస్త్రవేత్తలు హెచ్చరించారని UK మీడియా నివేదికలు తెలిపాయి. అన్ని ఇతర COVID-19 వేరియంట్‌ల కంటే స్ట్రెయిన్ స్పైక్ ప్రోటీన్‌లో ఎక్కువ మార్పులను కలిగి ఉందని రష్యన్ వార్తా సంస్థ నివేదించింది. దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కూడా దక్షిణాఫ్రికాలో కొత్త జాతి కనుగొన్నట్లు ధృవీకరించింది.
విదేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో భారత్ అప్రమత్తమైంది. యూరోప్, ఆఫ్రికా దేశాల నుండి వచ్చే ఫ్లైయర్లను కఠినమైన స్క్రీనింగ్, టెస్టింగ్ చేయాలని నిర్ణయించింది. దీనిక సంబంధించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.
We’re concerned about a false sense of security that vaccines have ended the #COVID19 pandemic. Vaccines save lives, but they do not fully prevent transmission. So please be careful and:
Avoid crowds.
Wear a mask.
Keep distance.
Open windows.Clean hands. pic.twitter.com/p2crxQvGuuBaca Juga
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) November 24, 2021
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2ZpxC33
0 Response to "WHO: వ్యాక్సిన్ వేయించుకున్నా మాస్క్ ధరించాల్సిందే.. డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్"
Post a Comment