
Sai Dharam Tej: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే షూటింగ్‌కు హాజరుకానున్న సాయి ధరమ్ తేజ్..?

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు. కొద్దీ రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ పై కెబుల్ బ్రిడ్డ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తేజుకు తీవ్ర గాయాలు కావడంతో.. సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లి హిల్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటీవలే దీపావళి పండగ రోజున తేజ్ పూర్తిగా కోలుకున్నడంటూ మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ అంతా కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు చిరు. ఈ గ్రూప్ ఫొటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది.
ఇదిలా ఉంటే త్వరలోనే తేజ్ షూటింగ్ కు హాజరు కానున్నాడని తెలుస్తుంది. రిపబ్లిక్ సినిమా తర్వాత తేజ్ బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో .. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఆ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. ‘భం బోలేనాథ్’ సినిమాకి దర్శకత్వం వహించిన కార్తీక్ వర్మ ఓ సరికొత్త కథతో తేజ్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా జనవరి నుంచి మొదలు కానుందట. ఈ సినిమా కోసం జనవరి నుంచి తేజ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే కొన్ని కథలను విన్న తేజ్ ఆయా షూటింగ్స్ ను కూడా త్వరలోనే మొదలు పెట్టనున్నాడని అంటున్నారు. మొత్తానికి మెగా హీరో కోలుకొని తిరిగి రంగంలోకి దిగుతున్నడని తెలిసి మెగా ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Manisha Koirala: ప్రయాణం కష్టమైనదని నాకు తెలుసు.. అయినా కొనసాగించాలి.. మనీషా కోయిరాలా..
Lasya Manjunath: స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న ‘లాస్య మంజునాథ్’ కొడుకు.. ఫ్యామిలీ ఫొటోస్..
Nivetha Pethuraj: న్యూ ఫోటో స్టిల్స్ తో కుర్రోళ్ళ మతి పోగొడుతున్న నివేత పేతురాజ్ ఫొటోస్..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3BS8VJW
0 Response to "Sai Dharam Tej: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే షూటింగ్‌కు హాజరుకానున్న సాయి ధరమ్ తేజ్..?"
Post a Comment