
Vishal: పొలిటికల్ ఎంట్రీ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన విశాల్.. ఏమన్నాడంటే..

Vishal: సినిమా హీరోలు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే.. తెలుగులో పవన్ కళ్యాణ్, తమిళ్‌లో కమల్ హాసన్.. కన్నడలో హీరో ఉదయ్ నిధిస్టాలిన్ ఇలా పలువురు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో హీరో కూడా రాజకీయాల్లోకి రాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్ స్టార్ హీరో విశాల్ గతంలో రాజకీయాల్లోకి వస్తున్నదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. జయలలిత మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లో తమిళ హీరో విశాల్ పోటీ చేసేందుకు రెడీ అయ్యాడు. ఆ సమయంలో నామినేషన్ కూడా వేసిన విశాల్ అనూహ్యంగా తప్పుకున్నారు. ఆతర్వాత మళ్ళీ రాజకీయాల ప్రస్తావన తీసుకురాలేదు. తాజాగా ఆయన పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఇటీవల విశాల్ నటించిన ఎనిమి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పొలిటికల్ రీ ఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు విశాల్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. విశాల్ మాట్లాడుతూ పూర్తి స్థాయి రాజకీయాలపై నాకు ఇప్పుడు ఆసక్తి లేదు అన్నారు. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపైనే ఉందని. సినిమాలు చేస్తున్న సమయంలో రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకొన్నాను.. ఈ నేపథ్యంలో అలంటి వాటిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంటాను. అంతే కానీ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశ్యం మాత్రం ప్రస్తుతం నాకు లేదు అంటూ చెప్పుకొచ్చారు విశాల్.
మరిన్ని ఇక్కడ చదవండి :
Manisha Koirala: ప్రయాణం కష్టమైనదని నాకు తెలుసు.. అయినా కొనసాగించాలి.. మనీషా కోయిరాలా..
Lasya Manjunath: స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న ‘లాస్య మంజునాథ్’ కొడుకు.. ఫ్యామిలీ ఫొటోస్..
Nivetha Pethuraj: న్యూ ఫోటో స్టిల్స్ తో కుర్రోళ్ళ మతి పోగొడుతున్న నివేత పేతురాజ్ ఫొటోస్..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3bS44xQ
0 Response to "Vishal: పొలిటికల్ ఎంట్రీ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన విశాల్.. ఏమన్నాడంటే.."
Post a Comment