-->
Keerthy Suresh: వరుస సినిమాలతో దూకుపోతున్న అందాల భామ.. కీర్తి కిట్టీలో మరో భారీ సినిమా..!

Keerthy Suresh: వరుస సినిమాలతో దూకుపోతున్న అందాల భామ.. కీర్తి కిట్టీలో మరో భారీ సినిమా..!

Keerthy

Keerthy Suresh: నేను లోకల్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ కీర్తిసురేష్. మొదటి సినిమాతోనే అందంలోనూ.. నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత అలనాటి సావిత్ర జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రలో నటించింది కీర్తి. ఈ సినిమాలో సావిత్రి అంటేనే కీర్తి అనేలా నటించి అందరి ప్రశంసలు పొందింది.  ప్రస్తుతం కీర్తి తెలుగులోనే కాకుండా.. తమిళ, మలయాళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ భామ. చిన్న హీరోలు పెద్ద హీరోలు అని తేడా లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ.

ఆ మధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ నటించి మెప్పించింది కీర్తి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడికి అదిరిపోయే ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ ను సంప్రదిస్తున్నారని తెలుస్తుంది. బోయపాటి – బన్నీ కాంబినేషన్లో మరో ప్రాజెక్టును సెట్ చేశారు. ప్రస్తుతం ‘అఖండ’ సినిమా విడుదల పనుల్లో ఉన్న బోయపాటి, ఆ తరువాత బన్నీతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను అనుకుంటున్నారట. ఇక బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. అటు కీర్తి మహేష్ సినిమాతోపాటు నాని సరసన దసరా అనే సినిమా చేస్తుంది. మరి  బోయపాటి – బన్నీ కాంబినేషన్లో కీర్తి నటిస్తుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Manisha Koirala: ప్రయాణం కష్టమైనదని నాకు తెలుసు.. అయినా కొనసాగించాలి.. మనీషా కోయిరాలా..

Lasya Manjunath: స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న ‘లాస్య మంజునాథ్’ కొడుకు.. ఫ్యామిలీ ఫొటోస్..

Nivetha Pethuraj: న్యూ ఫోటో స్టిల్స్ తో కుర్రోళ్ళ మతి పోగొడుతున్న నివేత పేతురాజ్ ఫొటోస్..

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3wrGnWE

Related Posts

0 Response to "Keerthy Suresh: వరుస సినిమాలతో దూకుపోతున్న అందాల భామ.. కీర్తి కిట్టీలో మరో భారీ సినిమా..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel