
Viral News: అదృష్టానికి కేరాఫ్ అడ్రస్ అంటే ఈమెనే చెప్పుకోవాలి.. ఏకంగా 19 అంతస్తుల పైనుంచి జారినా..!

Viral News: కొన్ని సందర్భాల్లో ‘‘వీడి ఆయుష్షు గట్టిదిరా.. టైం బావుంది కాబట్టి సరిపోయింది..’’ ఇలాంటి మాటలు వింటూంటాం. సాధారణంగా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు చుట్టూ ఉన్నవారి ఇలా అభిప్రాయపడుతుంటారు. అయితే, అలాంటి ఓ షాకింగ్ ఘటన గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇది చైనాలో జరిగింది. అసలు విషయానికి వస్తే…
తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన ఓ వృద్ధ మహిళ తాను నివసించే అపార్ట్‌మెంట్‌లోని బాల్కనీ నుంచి అదుపు తప్పి కిందకు పడిపోయింది. అలా పడిన మహిళ బట్టలు ఆరేసే ర్యాక్‌కు చిక్కుకొని ప్రమాదకరంగా తలకిందులుగా వేలాడింది. అపార్టుమెంట్‌లోని 19వ అంతస్తు బాల్కని నుంచి ఆమె కిందకి వేలాడటం గమనించిన స్థానికులు.. వెంటనే ఫైర్ ఫైటర్లకు సమాచారం అందించారు. గంలోకి దిగిన ఫైర్ ఫైటర్లు ఆ వృద్ధురాలని సురక్షితంగా కాపాడారు. ఆమెకు ఎలాంటి గాయాలూ కాలేదని, ప్రాణాపాయం తప్పిందని ఫైర్ ఫైటరర్లు పేర్కొన్నారు. ఇప్పుడు చెప్పండి మరి.. ఆమె ఆయుష్షు గట్టిదేనంటారా.. లేక ఆమె టైం బావుందంటారా.. ఏదైతేనేం ఆ మహిళ సురక్షితంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral Video:
An 82-year-old woman was seen dangling upside down from a clothes rack after falling from the 19th floor of a building in eastern China’s Jiangsu province. pic.twitter.com/Y4yvFRNBo8
— South China Morning Post (@SCMPNews) November 23, 2021
Also read:
Vikram: మళ్లీ పట్టాలెక్కిన కోబ్రా షూటింగ్.. సినిమా విడుదల ఎప్పుడంటే..
Indian Oil: ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3DTArIB
0 Response to "Viral News: అదృష్టానికి కేరాఫ్ అడ్రస్ అంటే ఈమెనే చెప్పుకోవాలి.. ఏకంగా 19 అంతస్తుల పైనుంచి జారినా..!"
Post a Comment