-->
మరో భారీ మల్టీస్టారర్‌కు తెరతీస్తోన్న శ్రీకాంత్‌ అడ్డాలా.. ఈసారి మెగా హీరోలను కలిపేందుకు ప్రయత్నం.?

మరో భారీ మల్టీస్టారర్‌కు తెరతీస్తోన్న శ్రీకాంత్‌ అడ్డాలా.. ఈసారి మెగా హీరోలను కలిపేందుకు ప్రయత్నం.?

Srikanth Addala

Srikanth Addala Movie: ‘సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మహేష్‌ బాబు, వెంకటేష్‌లను సిల్వర్‌ స్క్రీన్‌పై చూపించి సక్సెస్‌ అయ్యాడు దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. ఫుల్‌ లెన్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అలాగే భారీ మల్టీస్టారర్‌ చిత్రాలకు మరోసారి ఊపుతెచ్చిందీ సినిమా. దీంతో ఆ తర్వాత నుంచి టాలీవుడ్‌లో రకరకాల కాంబినేషన్‌లు సెట్‌ అవుతు వచ్చాయి. ఇలా ఒక యంగ్‌ హీరోను, మరో సీనియర్‌ హీరోను ఒప్పించి హిట్‌ కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రీకాంత్‌ ఈసారి మరో భారీ మల్టీ స్టారర్‌ మూవీకి తెరతీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇందుకోసం శ్రీకాంత్‌ అడ్డాలా ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవి, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌లను కలిపే పనిలో పడినట్లు సమాచారం. ఇటీవలే శ్రీకాంత్‌ అడ్డాల వినిపించిన ఓ స్క్రిప్ట్‌కు చిరంజీవి సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. ఇందులో చిరుతో పాటు మరో కీలకపాత్ర కూడా ఉంటుందని టాక్‌. ఆ పాత్రకోసం అల్లు అర్జున్‌ అయితే బాగుంటుందని చిరుకు శ్రీకాంత్‌ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి చిరు కూడా ఓకే చెప్పారని టాలీవుడ్‌ సర్కిల్స్‌లో టాక్‌ వినిపిస్తోంది.

ఒకవేళ ఈ వార్తే కనుక నిజమైతే టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో ఆసక్తికర మల్టీ స్టారర్‌ చిత్రానికి నాంది పలికినట్లు అవుతుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ తొలిసారి సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించింది చిరంజీవి నటించిన డాడీ సినిమాలోనే అనే విషయం తెలిసిందే. ఆ తర్వాతే బన్నీ గంగోత్రితో వెండి తెర ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: T20 World Cup2021: 45 నిమిషాల పాటు కోహ్లీ బ్యాటింగ్.. కన్ను ఆర్పకుండా చూసిన ఇషాన్, శ్రేయాస్..

ఆంధ్రప్రదేశ్‏లోని మారేడుమిల్లి అందాలను చూస్తే మైమరచిపోతారు..

Ind Vs Pak: టీ20 వరల్డ్ కప్ ఫైనల్‎లో భారత్, పాకిస్తాన్ తలపడితే చూడాలని ఉంది.. పాక్ కోచ్ సక్లైన్ ముస్తాక్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Bp0h5l

0 Response to "మరో భారీ మల్టీస్టారర్‌కు తెరతీస్తోన్న శ్రీకాంత్‌ అడ్డాలా.. ఈసారి మెగా హీరోలను కలిపేందుకు ప్రయత్నం.?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel