-->
Aryan Khan: ఆర్యన్‌కు బెయిల్‌ లభించడంపై స్పందించిన సెలబ్రిటీలు.. రామ్‌ గోపాల్‌ వర్మ ఏమన్నారో తెలుసా.?

Aryan Khan: ఆర్యన్‌కు బెయిల్‌ లభించడంపై స్పందించిన సెలబ్రిటీలు.. రామ్‌ గోపాల్‌ వర్మ ఏమన్నారో తెలుసా.?

Aryan Khan Bail

Aryan Khan: ముంబయి క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్ ప్రముఖ హీరో షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ అక్టోబర్‌ 3న అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. దాదాపు మూడు వారాల పాటు ఆర్యన్‌ జైలులో ఉన్నారు. ఎన్నిసార్లు బెయిల్‌కు ప్రయత్నించినప్పటికీ క్యాన్సల్‌ అవుతూ వచ్చింది. అయితే గురువారం ఆర్యన్‌కు ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. కోర్టు తీర్పుకు సంబంధించిన ఆర్డర్‌ కాపీ శుక్రవారం వచ్చే అవకాశాలున్నాయి. ఆర్యన్‌ ఖాన్‌తో పాటు మిగతా ఇద్దరు శుక్రవారం విడుదల కానున్నారు. ఒకవేళ ఆలస్యం జరిగితే శనివారం జైలు నుంచి వీరు బయటకు రానున్నారు. ఆర్యన్‌కు బెయిల్‌ రావడంతో షారుఖ్‌ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉంటే ఆర్యన్‌కు బెయిల్‌ రావడం పట్ల ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం హర్హం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రముఖ హీరో మాదవన్‌ ట్వీట్ చేస్తూ.. ‘ఆ దేవుడికి ధన్యవాదాలు. ఒక తండ్రిగా చాలా రిలీఫ్‌ పొందుతున్నాను. అంతా మంచిగా, సానుకూలంగా జరగాలని ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నారు.

ఇక సోనూ సూద్‌ స్పందిస్తూ.. ‘కాలమే తీర్పు చెబితే సాక్షులతో అవసరం లేదు’ అంటూ ట్వీట్ చేశారు. మరో బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్.. ‘ఎట్టకేలకు బెయిల్‌ లభించింది’ అంటూ ట్వీట్‌ చేశారు. దర్శకుడు హన్సల్‌ మెహతా ట్వీట్‌ చేస్తూ.. ‘ఈ రోజు రాత్రి నేను సంబరం చేసుకుంటాను’ అన్ని వ్యాఖ్యానించారు.

మరో దర్శకుడు సంజయ్‌ గుప్తా స్పందిస్తూ.. ‘ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ రావడం చాలా సంతోషం గా ఉంది. కానీ ఎలాంటి తప్పు చేయని ఓ కుర్రాడు ఇలా 25 రోజులపాటు జైలు ఊసుల వెనక ఉండడం నచ్చలేదు. ఇది కచ్చితంగా మారాలి. గాడ్‌ బ్లెస్‌ ఆర్యన్‌, ధైర్యంగా ఉండూ’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఇక అన్ని అంశాలపై తనదైన శైలిలో స్పందించే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు. ‘మెజారిటీ ప్రజలు ముకుల్ రోహత్గీ లాంటి ఖరీదైన లాయర్లను నియమించు కోలేరు. అంటే దీనర్థం అండర్ ట్రయల్‌గా అమాయక ప్రజలు జైళ్లలో మగ్గుతున్నట్టేగా. ఇన్నాళ్లు ఆర్యన్‌కు బెయిల్ రాలేదంటే.. మునుపటి లాయర్లు చాలా అసమర్థులా, అందుకే అనవసరంగా ఆర్యన్‌ ఇన్ని రోజులు జైలులో గడపవలసి వచ్చిందా’ అంటూ ప్రశ్నలు కురిపించారు.

Also Read: Samyuktha Menon: సొగసుల సాగరంలో మత్స్యకన్య ఈ మలయాళీ సోయగం.. సంయుక్త మీనన్

ఆంధ్రప్రదేశ్‏లోని మారేడుమిల్లి అందాలను చూస్తే మైమరచిపోతారు..

Dinesh Karthik: అభిమానులకు ‘డబుల్’ ధమాకా న్యూస్ చెప్పిన దినేష్ కార్తీక్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2XV0aRn

Related Posts

0 Response to "Aryan Khan: ఆర్యన్‌కు బెయిల్‌ లభించడంపై స్పందించిన సెలబ్రిటీలు.. రామ్‌ గోపాల్‌ వర్మ ఏమన్నారో తెలుసా.?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel