-->
Hyderabad Gangrape Case: గ్యాంగ్‌రేప్ కేసులో వెలుగులోకి కొత్తకోణం.. పోలీసులకే షాకిచ్చిన బాధితురాలు.. అసలేమైందంటే..?

Hyderabad Gangrape Case: గ్యాంగ్‌రేప్ కేసులో వెలుగులోకి కొత్తకోణం.. పోలీసులకే షాకిచ్చిన బాధితురాలు.. అసలేమైందంటే..?

Crime News

Hyderabad Gangrape Case: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఇల్లు చూపిస్తానని మహిళలను కారులో తీసుకెళ్లిన ముగ్గురు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లోకి తీసుకెళ్లి రివాల్వర్, కత్తితో బెదిరించి ఆమెను నగ్నంగా మార్చారు. ఆపై ముగ్గురు దారుణంగా రేప్ చేస్తూ ఫొటోలు, వీడియోలు తీశారు. విషయం బయటకు చెబితే నగ్న వీడియోలను బయటపెడతామని నెల రోజులుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వారి చెర నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బాధితురాలు ఏం చెప్పిందంటే..?
గోల్కొండ చోటా బజార్‌కు చెందిన గృహిణి (33) భర్తకు విడాకులు ఇచ్చి తన ఇద్దరి పిల్లలతో కలిసి ఒంటరిగా నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన తత్తు అనే యువకుడు మరో ఇద్దరితో కలిసి నెల రోజుల క్రితం ఇంటికి వచ్చారు. మంచి అద్దె ఇల్లు చూపిస్తానంటూ ఆమెను కారులో షాహిన్ నగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ లోనికి వెళ్లగానే వెంట తెచ్చుకున్న రివాల్వర్, చాకుతో చంపేస్తానని బెదిరించి వివస్త్రను చేశారు. చేతులు, కాళ్లు తాళ్లతో కట్టి పడేశారు. నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీశారు. ఆ తర్వాత అత్యంత పాశవికంగా ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయాన్ని ఎవరికైన చెబితే నగ్న ఫొటోలు బయట పెడతామని, చంపేస్తామని బెదిరించారు. ఇంటికి వచ్చిన ఆమెను అప్పటి నుంచి బయటకు కూడా వెళ్లనివ్వలేదు. నెల రోజులుగా వారి బెదిరింపులు తీవ్రం కావడంతో వాళ్ల నుంచి తప్పించుకుని గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోల్కొండ ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్ రావు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

తూచ్.. రేప్ అంతా కట్టు కథే..
మహిళ ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన గోల్కొండ పోలీసులు బాధితురాలు స్టేట్ మెంట్ రికార్డు కోసం వెళ్లారు. అసలు ఏం జరిగింది వివరంగా చెప్పాలని బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డు నమోదు చేయడం మొదలుపెట్టారు. ‘‘నేను ఇచ్చిన ఫిర్యాదు అంతా పచ్చి అబద్ధం.. తన అవసరాలకు డబ్బులు ఇస్తూ వస్తున్న తత్తు అనే యువకుడు ఈ మధ్యకాలంలో డబ్బులు ఇవ్వడం మానేయడంతో ఈ రేప్ కథ అల్లానంటూ’’ పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది.

ఆమెను నిందితులు బెదిరించారా..?

బాధితురాలు ఒక్కో సారి ఒక్కో విధంగా పొంతన లేని సమాధానాలు ఇస్తుండటంలో గోల్కొండ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. బాధితురాలు ఫిర్యాదు ఇచ్చిన అనంతరం.. నిందితులు బెదిరించడంతో మాట మార్చిందా? లేక ఇతర కారణాలు ఏమైన ఉన్నాయా అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకూ రేప్ జరిగిందా లేదా అనేది తేలాల్సి ఉంది.

నూర్ మహ్మద్, టీవీ9 తెలుగు రిపోర్టర్, హైదరాబాద్

Also Read:


from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3CTW0br

Related Posts

0 Response to "Hyderabad Gangrape Case: గ్యాంగ్‌రేప్ కేసులో వెలుగులోకి కొత్తకోణం.. పోలీసులకే షాకిచ్చిన బాధితురాలు.. అసలేమైందంటే..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel