
RCB IPL 2022 Retained Players: విరాట్ కోహ్లి పేమెంట్‌లో కటింగ్స్.. చాహల్ – పడిక్కల్ ఔట్..

RCB IPL 2022 Retained Players: IPL 2022కి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్ టైటిల్ గెలవాలని ఎదురుచూస్తున్న ఈ జట్టు వచ్చే సీజన్ నుంచి కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనుంది. అయితే విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను రిటైర్ చేయాలని RCB నిర్ణయించింది. కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే కనిపించనున్నాడు. మ్యాక్స్‌వెల్, సిరాజ్‌లకు కెప్టెన్సీ దక్కే అవకాశాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో మెగా వేలం సమయంలో RCB కెప్టెన్సీ ఆటగాళ్లను తీసుకోవలసి ఉంటుంది.
కాగా, దేవ్‌దత్ పడిక్కల్‌ను జట్టులో కొనసాగిస్తారని అంతా భావించారు. కానీ, పడిక్కల్‌ను కూడా రిలీవ్ చేసింది జట్టు యాజమాన్యం. పడిక్కల్ గత రెండు సీజన్‌ల నుంచి జట్టులో ప్రధానంగా ఉన్నాడు. తనదైన శైలి ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక యజ్వేంద్ర చాహల్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో బెస్ట్ స్పిన్నర్‌గా పేరు గాంచిన విషయం తెలిసిందే. కైల్ జామీసన్ ను కూడా ఆర్‌సీబీ రిటైన్ చేయలేదు. అయితే, IPL 2021 కి ముందు కైల్‌ని రూ.14 కోట్లకు తీసుకుంది జట్టు యాజమాన్యం.
RCB రిటైన్ చేసిన ప్లేయర్స్ లిస్ట్..
విరాట్ కోహ్లి జట్టులో కీలక ప్లేయర్. కోహ్లీ కెప్టెన్సీని విడిచిపెట్టాడు కానీ, RCB బ్రాండ్ విలువలో అతనికి పెద్ద సహకారం ఉంది. ఈసారి కోహ్లి రూ.15 కోట్లు అందుకోనున్నాడు. గతంలో కోహ్లి 17 కోట్లు తీసుకునేవాడు. అంటే ఇప్పుడు రూ. 2 కోట్లు కోత పడ్డాయి.
గ్లెన్ మాక్స్‌వెల్- IPL 2021లో జట్టు కోసం ఆల్ రౌండ్ ఆటను ప్రదర్శించాడు. దీంతో ఆర్సీబీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఇతనికి రూ.11 కోట్లు వస్తాయి.
RCB రిటైన్ చేయని ఆటగాళ్లు..
యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్, సచిన్ బేబీ, రజత్ పాటిదార్, కేఎస్ భరత్, కైల్ జేమీసన్, హర్షల్ పటేల్, నవదీప్ సైనీ, ఫిన్ అలెన్, పవన్ దేశ్‌పాండే, డాన్ క్రిస్టియన్, ఆడమ్ జంపా, అక్ష్‌దీప్ నాథ్, సుయాష్ ప్రభుదేశాయ్, మహ్మద్ అజరుద్దీన్, వష్‌బాజ్‌తోద్దీన్, , డేనియల్ సామ్స్, జార్జ్ గార్టెన్, స్కాట్ కుగ్లిన్, టిమ్ డేవిడ్, వనిందు హసరంగా, కేన్ రిచర్డ్‌సన్.
Welcome to #VIVOIPLRetention @RCBTweets have zeroed down on the retention list
What do you make of it?
#VIVOIPL pic.twitter.com/77AzHSVPH5
— IndianPremierLeague (@IPL) November 30, 2021
Also read:
Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..
Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..
Baca Juga
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/32NvymV
0 Response to "RCB IPL 2022 Retained Players: విరాట్ కోహ్లి పేమెంట్‌లో కటింగ్స్.. చాహల్ – పడిక్కల్ ఔట్.."
Post a Comment