-->
లఖీమ్‌పూర్‌ ఖేరిలో హైడ్రామా.. బాధిత రైతు కుటుంబాలను పరామర్శించిన రాహుల్, ప్రియాంక గాంధీ..

లఖీమ్‌పూర్‌ ఖేరిలో హైడ్రామా.. బాధిత రైతు కుటుంబాలను పరామర్శించిన రాహుల్, ప్రియాంక గాంధీ..

Rahul Gandhi

ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలో జరిగిన రైతు మరణాలు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రాంతమంతటా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా లఖీమ్‌పూర్‌ ఖేరీ పర్యటనకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు యూపీ ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య లఖీమ్‌పూర్‌ ఖేరీ ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబాలను రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ పరామర్శించారు.

లక్నో విమానాశ్రయం నుంచి తన సొంత వివాహంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ బయల్దేరుతుండగా.. సొంత వాహనంలో వెళ్లడం కుదరని.. పోలీస్ వాహనంలోనే వెళ్లాలని ఆయన్ని పోలీసులు అడ్డగించారు. ”నాకు వాహనం ఏర్పాటు చేయడానికి మీరెవరు. నేను నా సొంత వాహనంలో వెళ్తాను” అంటూ రాహుల్ గాంధీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి ధర్నాకు దిగారు.

‘నా వాహనంలో వెళ్లేందుకు అనుమతించేవరకు ఇక్కడ నుంచి కదలను. రైతులను దోచుకోవడమే కాకుండా.. వారిని అణిచివేస్తున్నారు. మూడు వ్యవసాయ చట్టాలు ఎవరి కోసం చేశారో అందరికీ తెలుసు’ అంటూ రాహుల్ గాంధీ ఫైర్ కావడంతో దిగొచ్చిన పోలీసులు సొంత వాహనంలో వెళ్లేందుకు అనుమతించారు. దీనితో రాహుల్ గాంధీ లక్నో విమానాశ్రయం నుంచి బయల్దేరి సీతాపూర్ గెస్ట్‌హౌస్‌లో ఉన్న ప్రియాంక గాంధీని కలుసుకున్నారు.

ఇక మూడు రోజుల నిర్భంధం తర్వాత ప్రియాంక గాంధీని విడుదల చేస్తున్నట్లు అదనపు మేజిస్ట్రేట్ ప్రకటించడంతో.. వీరిరువురూ కలిసి కాల్పుల్లో మరణించిన లవ్‌ప్రీత్‌ సింగ్, రమన్‌ కాశ్యప్‌ కుటుంబాలను పరామర్శించారు. ఆ తర్వాత మరో బాధితుడు నచార్‌ సింగ్‌ ఇంటికి వెళ్లారు.

సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు..

లఖీమ్‌పూర్‌ ఖేరీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తలపెట్టిన రైతుల నిరసనలో చోటు చేసుకున్న హింసాకాండను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది.



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/308jvzn

Related Posts

0 Response to "లఖీమ్‌పూర్‌ ఖేరిలో హైడ్రామా.. బాధిత రైతు కుటుంబాలను పరామర్శించిన రాహుల్, ప్రియాంక గాంధీ.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel