-->
KKR IPL 2022 Retained Players: కోల్‌కతా నైట్ రైజర్స్ టీమ్‌లో నలుగురు ప్లేయర్స్.. మిగతావాళ్లంతా ఔట్..

KKR IPL 2022 Retained Players: కోల్‌కతా నైట్ రైజర్స్ టీమ్‌లో నలుగురు ప్లేయర్స్.. మిగతావాళ్లంతా ఔట్..

Kkr

KKR IPL 2022 Retained Players: రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ నలుగురు ప్లేయర్స్‌ని రిటైన్ చేసింది. ఈ జట్టు IPL 2022 మెగా వేలానికి ముందు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, వరుణ్ చక్రవర్తిని టీమ్‌లో కొనసాగిస్తోంది. KKR రిటైన్ చేసిన వారిలో ఇద్దరు ఆల్‌రౌండర్లు, ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు ఉన్నారు. వెంకటేష్‌ అయ్యర్‌పై జట్టు యాజమాన్యం గట్టి నమ్మకమే పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అయ్యర్ IPL 2021లో కేకేఆర్‌లోకి వచ్చాడు. కానీ, అతని ప్రదర్శన మాత్రం నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది.

ఇక ఓన్ మోర్గాన్, కెప్టెన్‌గా ఉన్న దినేష్ కార్తీక్, అప్‌కమింగ్ కెప్టెన్‌గా పిలుచుకునే శుభ్‌మన్ గిల్ టీమ్ నుంచి ఔట్ అయ్యారు. మోర్గాన్ కెప్టెన్సీలో KKR IPL 2021 ఫైనల్‌కు చేరుకుంది. అదే సమయంలో, కార్తీక్ రెండు సీజన్లకు కెప్టెన్సీ వహించాడు. 2018 నుంచి జట్టులో కొనసాగుతున్న గిల్‌ను కేకేఆర్ ఉంచకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ యువ బ్యాట్స్‌మెన్‌పై యాజమాన్యం చాలా ఫోకస్ పెట్టింది. మేనేజ్‌మెంట్‌తో సంబంధం ఉన్న చాలా మంది వ్యక్తులు గిల్‌ను కెప్టెన్సీకి అర్హులుగా భావించారు. అయితే అయ్యర్ రాకతో గిల్ ఎడ్జ్ బలహీనపడింది.

కేకేఆర్ రిటైన్ చేసిన ప్లేయర్స్..
ఆండ్రీ రస్సెల్- వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆటగాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో మ్యాచ్‌ని మలుపు తిప్పే పవర్ కలిగిన ప్లేయర్. అయితే, ఇటీవలి కాలంలో అతని ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. కానీ, అతనిపై KKR‌కు విశ్వాసం చెక్కుచెదరలేదు. ఈ నేపథ్యంలోనే అతనికి రూ. 12 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంది.
వరుణ్ చక్రవర్తి – మిస్టరీ స్పిన్నర్‌గా KKR జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫిట్‌నెస్ సమస్య అతన్ని వేధిస్తోంది. కానీ, టీమ్ అతని సామర్థ్యంపై విశ్వాసం ఉంచింది. అతనికి 8 కోట్ల రూపాయలు చెల్లించనున్నారు.

వెంకటేష్ అయ్యర్- IPL 2021 సీజన్‌లో KKR టీమ్‌లో చేరాడు. సెకండాఫ్‌లో ఆడి ఓపెనర్‌గా అద్భుతంగా రాణించాడు. అయ్యర్.. మీడియం పేస్‌తో కూడా బౌలింగ్ చేస్తాడు. అల్‌రౌండ్ ప్రదర్శన చూపుతున్న అయ్యర్‌ను రూ. 8 కోట్లు చెల్లించి మరీ రిటైన్ చేసుకుంది.
సునీల్ నరైన్ – మిస్టరీ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మొదటి నుండి KKR జట్టులో ఆడుతూ వస్తున్నాడు. రూ. 6 కోట్లు అందనున్నాయి.

KKR రిలీజ్ చేసిన ప్లేయర్లు వీరే..

ఔన్ మోర్గాన్, కరుణ్ నాయర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, గజేంద్ర సింగ్, శుభ్‌మన్ గిల్, దినేష్ కార్తీక్, టిమ్ సీఫెర్ట్, షెల్డన్ జాక్సన్, షకీబ్ అల్ హసన్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, బెన్ కట్టింగ్, కమలేష్ నాగర్‌కోటి, సందీప్ వారియర్, పవన్ నేగి, ప్రముఖులు కృష్ణ, పాట్ కమిన్స్, హర్భజన్ సింగ్, టిమ్ సౌథీ, వైభవ్ అరోరా, లాకీ ఫెర్గూసన్.

Also read:

మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3G2IhAp

Related Posts

0 Response to "KKR IPL 2022 Retained Players: కోల్‌కతా నైట్ రైజర్స్ టీమ్‌లో నలుగురు ప్లేయర్స్.. మిగతావాళ్లంతా ఔట్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel