PBKS IPL 2022 Retained Players: దిగ్గజాలను వదిలేసిన పంజాబ్ కింగ్స్.. కేవలం ఇద్దరు ప్లేయర్స్‌నే..

PBKS IPL 2022 Retained Players: IPL 2022 మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకుంది. వీరిలో మయాంక్ అగర్వాల్, యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు. మిగిలిన వారు కెఎల్ రాహుల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్ వంటి సీనియర్లు, రవి బిష్ణోయ్, షారుక్ ఖాన్ వంటి యువ ప్లేయర్లను కూడా రిలీజ్ చేసింది. దీన్నిబట్టి చూస్తే.. వచ్చే సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మయాంక్‌కి కెప్టెన్సీ బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
పంజాబ్ కింగ్స్ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. దీంతో ఐపీఎల్ వేలంలో వారికి భారీగా డబ్బు వస్తుంది. పంజాబ్ టీమ్ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. రెండు సీజన్లలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించిన కేఎల్ రాహుల్ కూడా చేతులెత్తేశాడు. అయితే, రాహుల్ లక్నో ఫ్రాంచైజీలో చేరవచ్చని వార్తలు వస్తున్నాయి. అక్కడ దాదాపు 20 కోట్లు పొందే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, రాహుల్ ను జట్టులో ఉంచుకునేందుకు పంజాబ్ కింగ్స్ మేనేజ్ మెంట్ ప్రయత్నించినా ఆగలేదని చెబుతున్నారు.
యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను పంజాబ్ కింగ్స్ ఆపలేకపోవడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తూ.. ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే, రవి బిష్ణోయ్ ఈ టీమ్‌లో ఉండటం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ టీమ్ నుంచి తాను కూడా విడుదల కావాలనుకున్నాడు.
పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసిన ప్లేయర్స్..
మయాంక్ అగర్వాల్ – ఓపెనర్‌గా కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. కెఎల్ రాహుల్-మయాంక్ జోడి సక్సెస్‌ఫుల్ జోడీగా పేరుగాంచారు. మయాంక్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాగా, మయాంక్ అగర్వాల్ 12 కోట్లు అందుకోనున్నాడు.
అర్ష్‌దీప్ సింగ్- భారత అండర్-19 జట్టు నుండి వచ్చాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. తన డెత్ బౌలింగ్‌తో అందరినీ ఎంతగానో ఆకర్షించాడు. 4 కోట్ల రూపాయలు వస్తాయి. అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటికీ అన్‌క్యాప్డ్ ప్లేయర్. అంతతర్జాతీయ క్రికెట్ ఆడలేదు.
పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ వీరే..
కేఎల్ రాహుల్, మన్‌దీప్ సింగ్, సర్ఫరాజ్ అహ్మద్, ఐదాన్ మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, స్వప్నిల్ సింగ్, షారుఖ్ ఖాన్, నికోలస్ పూరన్, మోయిసెస్ ఆన్రిక్వెజ్, జలజ్ సక్సేనా, క్రిస్ గేల్, హర్‌ప్రీత్ బ్రార్, ఉత్కర్ష్ సింగ్, క్రిస్ జోర్డాన్, దీపక్ హుడా, మురుగన్ అశ్విన్, మురుగన్ అశ్విన్ షమీ, ఫాబియన్ అలెన్, ఆదిల్ రషీద్, రవి బిష్ణోయ్, ఇషాన్ పోరెల్, రిలే మెరెడిత్, ఝే రిచర్డ్‌సన్, నాథన్ ఎల్లిస్, సౌరభ్ కుమార్, దర్శన్ నల్కండే మరియు ప్రభ్‌సిమ్రాన్ సింగ్.
Here’s the @PunjabKingsIPL retention list
#VIVOIPLRetention pic.twitter.com/ABl5TWLFhG
— IndianPremierLeague (@IPL) November 30, 2021
Also read:
Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..
Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3d3FtGD



0 Response to "PBKS IPL 2022 Retained Players: దిగ్గజాలను వదిలేసిన పంజాబ్ కింగ్స్.. కేవలం ఇద్దరు ప్లేయర్స్‌నే.."
Post a Comment