-->
భారతీయులపై కొవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన UK ప్రభుత్వం.. ఈ నెల 11నుంచి మార్గం సులువు..

భారతీయులపై కొవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన UK ప్రభుత్వం.. ఈ నెల 11నుంచి మార్గం సులువు..

Vaccine

UK Government: కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్న భారతీయులను UK ప్రభుత్వం క్వారంటైన్‌ చేయాల్సిన అవసరం లేదని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తెలిపారు. ఈ నెల11 నుంచి UK వెళ్లే ఇండియన్స్‌ పై ఎలాంటి నిర్భంధం ఉండదని ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య జరగుతున్న టీక గొడవకు ముగింపు పలికారు. ట్వీట్‌లో ఈ విధంగా ఉంది. “అక్టోబర్ 11నుంచి UK వెళ్లే ఇండియన్స్‌ కోవిషీల్డ్ ద్వారా రెండు డోసులు తీసుకున్నా లేదా UK రెగ్యులేటర్ ద్వారా ఆమోదించిన ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నా క్వారంటైన్‌ ఉండదు. కాబట్టి ఇకనుంచి UK వెళ్లడం సులభం. ఈ విషయంపై UK ప్రభుత్వానికి సహకరించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు” అంటూ అలెక్స్ ఎల్లిస్ వీడియో సందేశంలో తెలిపారు.

విద్యార్థులు, వ్యాపారులు, పర్యాటకులకు సంబంధించి వేలాది వీసాలను ప్రాసెస్ చేసినట్లు బ్రిటిష్ హైకమిషనర్ తన సందేశంలో తెలిపారు. “గత కొన్ని వారాలుగా ఈ సమస్య వల్ల ఎంతమంది UKకి వెళ్లకుండా ఆగిపోయారో తెలుస్తుందన్నారు. రెండు దేశాల మధ్య మరిన్ని విమానాలను ప్రారంభిద్దామని పేర్కొన్నారు. గతంలో UK ప్రభుత్వం దేశ భద్రతా దృష్ట్యా ప్రయాణ నిబంధనలను సవరించింది. కోవిడ్ -19 కి వ్యతిరేకంగా ఆమోదించబడిన టీకాల జాబితాలో మొదట కోవిషీల్డ్ గురించి ప్రస్తావించలేదు.

తర్వాత UK ప్రభుత్వం కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఆమోదించింది. ఎందుకంటే ఇది ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా సూత్రీకరణ. అప్పటికే అది UK రెగ్యులేటరీ అథారిటీ ద్వారా గుర్తింపు పొందింది. కానీ కోవిన్ యప్‌ ద్వారా ఇస్తున్న భారతదేశ టీకా సర్టిఫికెట్‌లను అంగీకరించలేదు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత దేశాలు జారీ టీకా ధ్రువీకరణ పత్రాలకు కనీస ప్రమాణాలుండాలని యూకే ప్రభుత్వం వ్యాఖ్యానించింది. దీంతో సమస్య మొదలైంది.

దీని వల్ల భారతీయులు టీకాలు తీసుకున్నప్పటికీ బ్రిటన్‌ వెళ్లిన తర్వాత 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి.చర్చలు కొనసాగుతుండగా యుకె నుంచి భారతదేశానికి వచ్చే వ్యక్తులపై కూడా భారత్ ఇదే విధమైన నిబంధనలను విధించింది. టీకాతో సంబంధం లేకుండా ఎవరైనా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని పేర్కొంది. దీంతో ప్రస్తుతం బ్రిటన్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ స్పందించి ప్రస్తుతం సమస్యను పరిష్కరించారు.

Amarinder Singh: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. వ్యాక్సిన్ తీసుకోకుంటే బలవంతపు సెలవు..

India Coronavirus: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. దేశవ్యాప్తంగా నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

Telangana: గుడ్ న్యూస్.. ప్రతి రోజూ 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్లు.. స్పెషల్ డ్రైవ్‌కు సీఎం కేసీఆర్ ఆదేశం

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lkNZWL

Related Posts

0 Response to "భారతీయులపై కొవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన UK ప్రభుత్వం.. ఈ నెల 11నుంచి మార్గం సులువు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel