-->
PM Narendra Modi: నేడు హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రధాని పర్యటన.. రూ. 11వేల కోట్ల ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు

PM Narendra Modi: నేడు హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రధాని పర్యటన.. రూ. 11వేల కోట్ల ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు

Pm Narendra Modi

Himachal Pradesh: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం (డిసెంబర్ 27) హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రూ.11,000 కోట్ల విలువైన జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అంతకుముందు, ఉదయం 11:30 గంటలకు హిమాచల్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సెకండ్ గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకకు పీఎం అధ్యక్షత వహించనున్నారు.

అనంతరం రేణుకాజీ డ్యామ్ ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు నేడు మోక్షం కలగనుంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాలతో మాట్లాడి, ఈ ఆరింటిని ఏకతాటిపైకి తెచ్చింది. దాదాపు 7 వేల కోట్లతో 40 మెగావాట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ఇది ఢిల్లీకి చాలా లాభదాయకంగా మారనుంది. దీని ద్వారా ఢిల్లీకి ప్రతి సంవత్సరం దాదాపు 500 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని సరఫరా చేయగలుగుతారు.

లుహ్రీ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన..
లుహ్రీ ఫేజ్ వన్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ 210 మెగావాట్ల ప్రాజెక్టును రూ.1800 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్నారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం 750 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

ధౌలసిద్ధ జలవిద్యుత్ ప్రాజెక్ట్
ప్రధానమంత్రి ధౌలసిద్ధ్ జలవిద్యుత్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేస్తారు. హమీర్‌పూర్ జిల్లాలో ఇది మొదటి జలవిద్యుత్ ప్రాజెక్ట్. ఈ 66 మెగావాట్ల ప్రాజెక్టును రూ.680 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్నారు. దీనివల్ల ఏటా 300 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

సవ్రా-కుద్దు జలవిద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం..

సవ్రా-కుద్దు జలవిద్యుత్ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ 111 మెగావాట్ల ప్రాజెక్టును దాదాపు రూ. 2080 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీంతో ప్రతి సంవత్సరం 380 మిలియన్ యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీంతో ఏటా రూ.120 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో రూ. 28,000 కోట్ల ప్రాజెక్టులకు మోక్షం..
హిమాచల్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సెకండ్ గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకకు కూడా ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో దాదాపు రూ.28,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు ఈ రంగంలో పెట్టుబడులను పెంచే అవకాశం ఉంది.

Also Read: Manikka Vinayagam: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సింగర్, నటుడు మాణిక్య వినాయగం కన్నుమూత

BSNL Prepaid Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. తక్కువ ధరతో రోజు 5జీబీ డేటా ప్లాన్‌



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3z16PY7

Related Posts

0 Response to "PM Narendra Modi: నేడు హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రధాని పర్యటన.. రూ. 11వేల కోట్ల ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel