-->
Allu Arjun: కాకినాడలో పుష్ఫరాజ్‌ సందడి.. వర్షం కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌. గ్యాప్‌లో ఎక్కడికి వెళ్లాడో తెలుసా.?

Allu Arjun: కాకినాడలో పుష్ఫరాజ్‌ సందడి.. వర్షం కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌. గ్యాప్‌లో ఎక్కడికి వెళ్లాడో తెలుసా.?

Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ఫ’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రానుంది. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించని విధంగా మాస్‌ లుక్‌లో అలరించనున్నారు. ఇక ఇందులో రష్మిక తొలిసారి బన్నీతో చిందులు వేయనుంది. ఇదిలా ఉంటే మొదట్లో ఒకే పార్ట్‌గా విడుదల చేద్దామనుకున్న ఈ సినిమా తర్వాత నిడివి పెరగడంతో రెండు పార్టులుగా విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా కరోనా కారణంగా కొన్ని రోజులు ఆగినా ఇప్పుడు మళ్లీ వేగవమంతమైంది. ఇక ప్రస్తుతం పుష్ఫ చిత్రీకరణ కాకినాడలో జరుగుతుంది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్‌ శనివారం కాకినాడ చేరుకున్నారు.

దీంతో బన్నీ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున హంగామా చేశారు. కాకినాడ పోర్టు ఏరియాలో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే శనివారం ఆ ఏరియాలో భారీగా వర్షం పడడంతో సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. దీంతో అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయంలో బన్నీ కాకినాడలోని ఓ థియేటర్‌లో సినిమా వీక్షించాడు. గోపీచంద్‌ హీరోగా తెరకెక్కిన ‘సీటీమార్’ సినిమాను చూశారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. బన్నీతో ఫొటోలు, సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపించారు. మరి ఈరోజు షూటింగ్‌కు వాతావరణం అనుకూలిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌ను క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: Bigg Boss 5 Telugu: బూతులు తిట్టమంటూ సరయుని కోరిన నాగ్.. ఇక అమ్మడు ఆగేనా..

Hyderabad: హైదరాబాదీలకు ఈ సండే మరింత ఫన్‌గా మారనుంది.. ట్యాంక్‌బండ్‌పై కొత్త అట్రాక్షన్స్‌.

Snake Bite: రెండు గంటల పాటు చిన్నారి తల వద్దే తిష్టవేసిన నాగుపాము.. ఆ తరువాత వెళ్తూ వెళ్తూ..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EbEm4g

0 Response to "Allu Arjun: కాకినాడలో పుష్ఫరాజ్‌ సందడి.. వర్షం కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌. గ్యాప్‌లో ఎక్కడికి వెళ్లాడో తెలుసా.?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel