-->
Bigg Boss 5 Telugu: బూతులు తిట్టమంటూ సరయుని కోరిన నాగ్.. ఇక అమ్మడు ఆగేనా..

Bigg Boss 5 Telugu: బూతులు తిట్టమంటూ సరయుని కోరిన నాగ్.. ఇక అమ్మడు ఆగేనా..

Sarayu

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ఎడొవరోజు కూడా అదే హంగామా నడిచింది. వారాంతం కావడంతో కింగ్ నాగార్జున ఇంటిసబ్యులను పలకరించారు. వారం రోజులు ఇంటిసభ్యులు ఏం చేశారో చెప్పి ఆటపట్టించాడు నాగ్. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్‌లోకి బోల్డ్ బ్యూటీగా అడుగుపెట్టిన సరయుని ఓ రెండు బూతులు తిట్టు అంటూ కోరాడు నాగార్జున. బయట యూట్యూబ్ ఛానల్‌‌‌లో అయితే బూతులు తప్ప వేరేవి మాట్లాడని సరయు. బిగ్ బాస్ హౌస్‌లో మాత్రం నోరు కట్టేసుకుని ఉంటుంది. అసలే బూతులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సరయుని నాగ్ .. అసలు నువ్వు బూతులు మాట్లాడటం లేదు ఏంటి ..? అని ప్రశ్నించగా.. మీరు తిడతారని బూతులు మాట్లాడటం లేదు సార్.. అంటూ సమాధానం ఇచ్చింది సరయు. దానికి నాగ్ నువ్వు నీలనే ఉండమ్మా.. అంటూ ఇండైరెక్ట్‌గా బూతులు తిట్టు అంటూ హింట్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా నాగ్‌కు ఓ ఆఫర్ ఇచ్చింది సరయు.

నాగ్ సార్ నన్ను మీరు డేట్‌కి తీసుకెళ్తా అంటే బూతులు తిడతా అని చెప్పింది సరయు. డైరెక్ట్‌గా ఇలా డేట్ ఆఫర్ చేసింది ఈ 7 ఆర్ట్స్ చిన్నది. దీంతో నాగార్జున.. నిన్ను డేట్‌కి తీసుకుని వెళ్లాలంటే ముందు బయటకు రావాలి కదా.. అని నాగార్జునా.. వెంటనే అందుకున్న సరయు ‘ఇప్పుడు కాదులే సార్.. వంద రోజులు తరువాత డేట్‌కి వెళ్దాం’ అని అంది..  వంద రోజుల తరువాతా.. అయితే ఓకేలే అని అనేశారు నాగార్జున. దాంతో బూతులు తిట్టడానికి నాగార్జున అనుమతి ఇచ్చేశాడు. ఇక సరయు ఆగుతుందా ఏ రేంజ్‌లో బూతులు తిడుతుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Bigg Boss 5 Telugu: వీకెండ్ మస్తీ మొదలెట్టిన నాగ్.. కాస్త కనిపించారా అంటూ షణ్ముఖ్‏కు కౌంటర్.. ప్రోమో అదుర్స్..

Bigg Boss 5 Telugu: తెలుసుకోవాల్సింది చాలా ఉందంటున్న అరియానా.. బిగ్‏బాస్ బజ్ లెటేస్ట్ ప్రోమో….

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్‏లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న అందాల యాంకరమ్మ.. ఇక అసలైన రచ్చ అప్పుడే..

 

 

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2VxyIYy

Related Posts

0 Response to "Bigg Boss 5 Telugu: బూతులు తిట్టమంటూ సరయుని కోరిన నాగ్.. ఇక అమ్మడు ఆగేనా.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel