
Hyderabad: హైదరాబాదీలకు ఈ సండే మరింత ఫన్‌గా మారనుంది.. ట్యాంక్‌బండ్‌పై కొత్త అట్రాక్షన్స్.

Hyderabad: ట్రాఫిక్ రణగొణ ధ్వనులు లేకుండా ట్యాంక్‌బండ్ అందాలను అస్వాదించేందుకు గాను జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రతీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తోన్న విషయం తెలసిందే. దీంతో నగర వాసుల నుంచి విశేష స్పందన వస్తోంది. నగర నలుమూలల నుంచి ఆదివారం ట్యాంక్‌బండ్‌కు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. ఈ క్రమంలోనే నగర ప్రజలకు ఈ సండేను మరింత ఫండేగా మార్చేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పలు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించే క్రమంలో నేడు (సెప్టెంబర్ 12) మరికొన్ని కొత్త అట్రాక్షన్స్ యాడ్ చేస్తున్నారు.
ఈ విషయమై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు. ‘ఈరోజు ట్యాంక్ బండ్‌పై సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ‘సండ్ ఫండే’ను అస్సలు మిస్‌కాకండి. ఇండియన్ ఆర్మీతో బ్యాగ్‌పైపర్ బ్యాండ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ స్టాల్స్, శిల్పారామ్‌కు చెందిన స్టాల్స్, ఫుడ్ ట్రక్స్, టీఎస్‌సీఓ హాడ్లూమ్ స్టాల్, హెచ్‌ఎమ్‌డీఏ ఉచిత మొక్కల పంపిణీ, లేజర్ షో వంటి కార్యక్రమాలు చేపట్టనున్నాము’ అంటూ ట్వీట్ చేశారు. మరి ఎందుకు ఆలస్యం ఈ వీకెండ్‌ను ట్యాంక్‌బండ్‌పై మరింత జాయ్ ఫుల్‌గా గడిపేయండి.
Not to be missed “Sunday Funday” on Sept 12 from 5-10 pm @ Tank Bund
-Ceremonial Bagpiper Band of Indian Army
– food trucks
-art & crafts stalls
– display & sale from Shilaramam artisans
-TSCO handloom stall– free distribution of saplings by @HMDA_GovBaca Juga
&
– Laser show@KTRTRS pic.twitter.com/phFjd6W6Bd— Arvind Kumar (@arvindkumar_ias) September 11, 2021
ట్రాఫిక్ మళ్లింపు ఇలా ఉంటుంది..
ట్యాంక్‌బండ్‌పై ఆంక్షల దృష్ట్యా.. సిటీ బస్సులను వివిధ మార్గాల్లో మళ్లించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్, రాణిగంజ్ నుంచి వచ్చే బస్సులను బోట్స్ క్లబ్, మారియట్ హోటల్, డీబీఆర్ మిల్, కట్ట మైసమ్మ దేవాలయం ద్వారా మళ్లింపు. సచివాలయం నుంచి వచ్చే బస్సులు తెలుగు తల్లీ ఫ్లై ఓవర్, డిబిఆర్ మిల్లులు, మారియట్ హోటల్, బైబిల్ హౌస్, రాణి గుంజ్ నుంచి మళ్లిస్తారు. ఇక ట్యాంక్‌బండ్‌కు వచ్చే వారి కోసం టీఎస్‌ఆర్‌టీసీ హైదరాబాద్‌లోని అన్ని ముఖ్యమైన ప్రదేశాల నుంచి ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్, కోటి, కాచిగూడ స్టేషన్, మెహదీపట్నం, హకీంపేట, చార్మినార్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
Mysterious Deaths: స్మశానవాటికలో అర్థరాత్రి ‘శవాల వర్షం’.. అది చూసి జనాలు హడలిపోయారు..!
Viral News: బాప్‌రే ఇలా చేసిందేంటి?.. టీవీలో కనిపించిన ఆనందంలో ఓ మహిళ ఏకంగా..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3A06fcZ
0 Response to "Hyderabad: హైదరాబాదీలకు ఈ సండే మరింత ఫన్‌గా మారనుంది.. ట్యాంక్‌బండ్‌పై కొత్త అట్రాక్షన్స్."
Post a Comment