
Fire Accident: బైక్‌పై వెళుతుండగా అకస్మాత్తుగా మంటలు.. మహిళ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

Woman Constable Injured: హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఫ్లైఓవర్‌పై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నడుస్తున్న ద్విచక్ర వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఓ మహిళా కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మల్కాజిగిరిలోని మౌలాలి ఫ్లై ఓవర్వంతెనపై కానిస్టేబుల్ జ్యోష్ణ ద్విచక్రవాహనంపై వెళుతుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో జ్యోష్ణ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన వాహనదారులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జోష్ణకు చికిత్స జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోయింది. మహిళా కానిస్టేబుల్ కాలికి తీవ్రగాయాలైనట్లు పేర్కొంటున్నారు. సమాచారం మేరకు అగ్నిమాపక దళం సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:
Telangana: గుడ్ న్యూస్.. ప్రతి రోజూ 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్లు.. స్పెషల్ డ్రైవ్‌కు సీఎం కేసీఆర్ ఆదేశం
Bigg Boss 5 Telugu: దమ్ దమ్ చేస్తానంది.. వారం కూడా ఉండలేకపోయింది.. బిగ్‌బాస్ తొలి ఎలిమినేషన్ ఆమే..!
Accident: ఆంధ్రప్రదేశ్- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోరం.. లారీ – జీప్ ఢీ కొని ఏడుగురు దుర్మరణం
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3hsHZZL
0 Response to "Fire Accident: బైక్‌పై వెళుతుండగా అకస్మాత్తుగా మంటలు.. మహిళ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు"
Post a Comment