
Sivakarthikeyan : ‘డాక్టర్’తో హిట్ కొట్టి ఇప్పుడు “డాన్”గా రానున్న కుర్ర హీరో శివకార్తికేయన్..

Sivakarthikeyan : శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘డాన్’. ప్రముఖ నిర్మాత సుభాస్కరన్ అల్లిరాజా సమర్పణలో ఆయన నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, హీరో శివ కార్తికేయన్ నిర్మాణ సంస్థ శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంలో రూపొందుతున్న చిత్రమిది. సిబి చక్రవర్తి దర్శకుడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
టైటిల్ అనౌన్స్‌మెంట్ మోషన్ పోస్టర్ చూస్తే కాలేజీ నేపథ్యంలో రూపొందుతోన్నఎంటర్‌టైనర్ అనే అభిప్రాయం కలిగింది. ఫస్ట్ లుక్ చూస్తే కాలేజీ ఫిల్మ్ అని క్లారిటీ వచ్చింది. శివ కార్తికేయన్ స్టూడెంట్‌గా కనిపించనున్నారు. ప్రొఫెసర్లకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న స్టూడెంట్స్ కు శివ కార్తికేయన్ నాయకత్వం వహిస్తున్నట్టు ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందని చిత్రబృందం చెబుతోంది.
ఇటీవల ‘డాక్టర్’తో శివ కార్తికేయన్ తమిళ, తెలుగు భాషల్లో భారీ విజయం అందుకున్నారు. ఆ సినిమాలో ఆయనకు జోడీగా నటించిన ప్రియాంకా అరుల్ మోహన్, ఈ ‘డాన్’లోనూ కథానాయికగా నటించారు. ఎస్‌జె సూర్య, సముద్రఖని, సూరి, బాల శరవణన్, ఆర్‌జె విజయ్, శివాంగి, మునిష్కాంత్, కాళీ వెంకట్, రాధా రవి, సింగంపులి, జార్జ్, అధీరా తదితరులు సినిమాలో నటించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Allu Sirish: సోషల్ మీడియాను వీడిన అల్లు శిరీష్.. అసలు మ్యాటరేంటంటే..
Divi Vadthya: ఏ ‘దివి’లో విరిసిన పారిజాతమో… బిగ్ బాస్ బ్యూటీ ఫోటోలు వైరల్
Anchor Vishnu Priya: తన పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ విష్ణు ప్రియ.. ఇదిగో పోస్ట్..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3qAKRt7
0 Response to "Sivakarthikeyan : ‘డాక్టర్’తో హిట్ కొట్టి ఇప్పుడు “డాన్”గా రానున్న కుర్ర హీరో శివకార్తికేయన్.."
Post a Comment