-->
Actress Tamanna : సినిమాలకు బ్రేక్ తీసుకుందామనుకున్నా కానీ.. ఆసక్తికర కామెంట్స్ చేసిన తమన్నా..

Actress Tamanna : సినిమాలకు బ్రేక్ తీసుకుందామనుకున్నా కానీ.. ఆసక్తికర కామెంట్స్ చేసిన తమన్నా..

Tamanna

Actress Tamanna : మెగాస్టార్ చిరంజీవి స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌‌లో రాబోతోన్న యాక్ష్ ఎంటర్టైనర్ భోళా శంకర్ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను హైద్రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నవంబర్ 11న ఉదయం ఘనంగా నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు క్లాప్ కొట్టగా.. వి వి వినాయక్ కెమెరామెన్ స్వీచ్ ఆన్ చేశారు. కొరటాల శివ, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, బాబీ, గోపీచంద్ మలినేని, ఎన్ శంకర్, రైటర్ సత్యానంద్ కలిసి స్క్రిప్ట్ ను మేకర్స్ కి అందజేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ..

‘ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సినిమాలు బయటకు రావడం, హిట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పెద్ద సినిమాలు ఇంకా ప్రారంభం అవ్వడం, ఇలాంటివి త్వరగా రావాలని ప్రేక్షకులు అనుకుంటారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు అనిల్ గారికి థ్యాంక్స్. ఈ ఏడాదిలో చాలా సినిమాలు చేశాను. ఇక కాస్త బ్రేక్ తీసుకుందామని అనుకున్నాను. కానీ మెహర్ గారు నన్ను అడిగారు. మామూలుగా అయితే కెరీర్ ప్రారంభంలోనే నేను ఆయనతో చేయాల్సింది. కానీ డేట్స్ వల్ల అడ్జస్ట్ కాలేదు. ఈ చిత్రంలో నేను ఈ పాత్రకు న్యాయం చేస్తాను అని నమ్మనందుకు థ్యాంక్స్. ఇప్పటి వరకు నా బెస్ట్ చూడలేదని అనుకుంటున్నాను. ఇందులో నన్ను మెహర్ గారు అద్బుతంగా చూపిస్తారు అని అనుకుంటున్నాను. ఇన్నేళ్ల తరువాత రీమేక్ చేస్తున్నారంటే.. ఆ కథలోని బలం. అది మెహర్ గారు ఇంకా బాగా చూపిస్తారని అనుకుంటున్నాను. కెమెరామెన్ డడ్లీ ఎప్పుడూ నన్ను అందంగానే చూపిస్తారు’ అని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Sirish: సోషల్‌ మీడియాను వీడిన అల్లు శిరీష్‌.. అసలు మ్యాటరేంటంటే..

Divi Vadthya: ఏ ‘దివి’లో విరిసిన పారిజాతమో… బిగ్ బాస్ బ్యూటీ ఫోటోలు వైరల్ 

Anchor Vishnu Priya: తన పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ విష్ణు ప్రియ.. ఇదిగో పోస్ట్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2YCsfgv

Related Posts

0 Response to "Actress Tamanna : సినిమాలకు బ్రేక్ తీసుకుందామనుకున్నా కానీ.. ఆసక్తికర కామెంట్స్ చేసిన తమన్నా.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel