-->
Dulquer Salmaan : అందుకే చాలా సెలెక్టివ్‌గా తెలుగు సినిమాలను ఎంచుకుంటున్నా.. ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చిన దుల్కర్..

Dulquer Salmaan : అందుకే చాలా సెలెక్టివ్‌గా తెలుగు సినిమాలను ఎంచుకుంటున్నా.. ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చిన దుల్కర్..

Dulquer Salmaan

Dulquer Salmaan:  దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం ‘కురుప్‌’. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ తెరకెక్కించారు. శోభిత కథానాయిక. ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సన్నీ వేస్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో నవంబర్‌ 12న విడుదల కానుంది. కురుప్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బుధవారం దుల్కర్ సల్మాన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

తెలుగు ఇండస్ట్రీని నేను కొత్త ఇండస్ట్రీగా చూడటం లేదు. నన్ను ఇక్కడి వాళ్లు అంగీకరించారు. ప్రేమిస్తున్నారు. నాకు ఇక్కడ రానా, అఖిల్ వంటి స్నేహితులున్నారు అన్నారు. వైజయంతీ బ్యానర్ నాకు ఫ్యామిలీ వంటిది. నా ప్రతీ సినిమా ఇక్కడకు వస్తుందని చెప్పలేను. కానీ ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అందుకే విడుదల చేస్తున్నాం. నటుడిగా ఎక్కువ మందికి దగ్గరవ్వాలనేది నా లక్ష్యం.

డైరెక్టర్, నా జర్నీ ఒకేసారి మొదలైంది. నా డెబ్యూ ఆయనతోనే జరిగింది. అప్పుడే కురుప్ సినిమా చేయాలని అనుకున్నారు. ఈ కథ ఏంటి అనేది అందరికీ తెలుసు. ఆ ఘటన మీద ఎన్నో వార్తలు వచ్చాయి. మొత్తం క్రైమ్ నేపథ్యంలో కాకుండా అతని బాల్యం, యవ్వనంలో ఏం జరిగిందనేది కూడా చూపిస్తున్నాం. సినిమాను ఎలా చెప్పబోతోన్నామనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అన్నారు దుల్కర్.

ఇది కిల్లర్ స్టోరీ. ఇందులో మేం అతడిని హీరోలా చూపించలేదు. నేను బ్యాడ్ గాయ్ పాత్రలోనే కనిపిస్తాను. అతని వల్ల ఎన్ని కుబుంబాలు బాధపడ్డాయో చూపించాం. చివరకు ఏ సందేశామన్నది ఇచ్చామో చూడండి. కురుప్ గురించి మేం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అలా ఉండే వాడు.. ఇలా ఉండే వాడు అని చాలా విషయాలు విన్నాం. ఎక్కువగా లైమ్ లైట్‌లో ఉండేందుకు ఇష్టపడేవాడు.. ఎంజాయ్ చేయడం, జల్సాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. అతడి గురించి ఎన్నో విషయాలు అప్పట్లో పేపర్లో వచ్చింది. వాటిని రిఫరెన్స్‌గా తీసుకుని పాత్రను పోషించాను అని చెప్పుకొచ్చారు.

ఇది ఏ జానర్ అనేది చెప్పడం కష్టం. ఇందులో అన్ని రకాల జానర్లు ఉంటాయి. యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్, బయోపిక్ ఇలా ప్రతీ ఒక్క జానర్ ఉంటుంది. ఈ చిత్రాన్ని మేం థియేటర్లో విడుదల చేసేందుకు తీశాం. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం భారీ ఎత్తున నిర్మించాం. అలానే సినిమాను థియేటర్లోనే విడుదల చేస్తున్నాం. ఓటీటీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే ఈ సినిమాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ, ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించింది. ఇక ఈ చిత్రం వర్కవుట్ అయితే వరుసగా సినిమాలు వచ్చేందుకు రెడీగా ఉన్నాయి అన్నారు. సినిమా మీద నమ్మకం ఉంది. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అందుకే ఇంత భారీగా నిర్మించాం. భారీగానే విడుదల చేస్తున్నాం. తెలుగులో సినిమాలు చేస్తే మంచి కథలే ఎంచుకోవాలని అనుకున్నాను. మహానటి వంటి ఒక్క చిత్రం చాలు. మంచి సినిమా చేశాడు అని ప్రేక్షకులు అనుకుంటారు. గుర్తు పెట్టుకుంటారు. అందుకే నేను చాలా సెలెక్టివ్‌గా తెలుగు సినిమాలను ఎంచుకుంటున్నాను. ఇప్పుడు హను రాఘవపూడి, వైజయంతీ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాను. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాది విడుదల కానుంది. యుద్ద నేపథ్యం, ప్రేమ కథతో ఆ సినిమా ఉండబోతోంది అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Sirish: సోషల్‌ మీడియాను వీడిన అల్లు శిరీష్‌.. అసలు మ్యాటరేంటంటే..

Divi Vadthya: ఏ ‘దివి’లో విరిసిన పారిజాతమో… బిగ్ బాస్ బ్యూటీ ఫోటోలు వైరల్ 

Anchor Vishnu Priya: తన పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ విష్ణు ప్రియ.. ఇదిగో పోస్ట్..

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3op3woK

Related Posts

0 Response to "Dulquer Salmaan : అందుకే చాలా సెలెక్టివ్‌గా తెలుగు సినిమాలను ఎంచుకుంటున్నా.. ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చిన దుల్కర్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel