-->
Viral Video: సినిమాలను తలదన్నే ఛేజింగ్ సీన్‌.. దొంగను పట్టుకునేందుకు పోలీస్‌ పరుగులు

Viral Video: సినిమాలను తలదన్నే ఛేజింగ్ సీన్‌.. దొంగను పట్టుకునేందుకు పోలీస్‌ పరుగులు

Police Chasing Thief

తమిళనాడులోని కాంచీపురంలో దొంగలు రెచ్చిపోతున్నారు. కార్లను దొంగలిస్తూ అటు కార్ల యజమానులకు, ఇటు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో దొంగలను ఎలాగైనా పట్టుకోవాలనే ధృఢ సంకల్పంతో ఉన్నారు పోలీసులు. వెంకటేష్‌ గ్యాంగ్‌ ఈ కార్ల దొంగతనాలకు పాల్పడుతోందని తెలుసుకుని వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. తాజాగా ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకునే సీన్‌ సినిమా సీన్‌ను తలపించింది. ఈ ఘటనలో ఓ పోలీసుకు తీవ్రగాయాలయ్యాయి. అటు ఈ చేజింగ్‌ సీన్‌ తమిళనాడులో వైరల్‌గా మారింది.

కాంచీపురంలో ఓ కారు చోరీ జరగ్గా, పలు జిల్లాల్లో కూడా కార్ల దొంగతనాలు పెరిగిపోయాయి. వీటిని చోరీ చేస్తోంది వెంకటేష్ గ్యాంగ్ అని తెలుసుకుని, ఆ గ్యాంగ్‌ సభ్యులను పట్టుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు. వెంకటేష్‌ గ్యాంగ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులను అప్రమత్తం చేశారు. దొంగిలించబడిన కార్లకు సంబంధించిన వివరాలను అన్ని జిల్లాలకు పంపించారు పోలీస్‌ అధికారులు . ఇదే క్రమంలో తంజావూర్ జిల్లా పట్టుకోట్టైలో పోలిసుల తనిఖీలలో దొంగిలించిన కారుని గుర్తించారు. అంతేకాదు ఈ కారును దొంగలించిన వెంకటేష్‌ గ్యాంగ్‌ సభ్యుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రశాంత్‌. సినిమా స్టయిల్లో పరుగెడుతూ ఇద్దరు దొంగలను పట్టుకున్నారు కానిస్టేబుల్‌ ప్రశాంత్‌.

పోలీస్… గ్యాంగ్ ని పట్టుకునే క్రమంలో జరిగిన చేజింగ్‌ వీడియోలు ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా వైరల్‌గా మారాయి.
పోలీస్‌ తనిఖీల్లో పట్టుకున్న కారుని స్వాధీనం చేసుకుని పారిపోయిన దొంగల గ్యాంగ్‌ లీడర్‌ వెంకటేష్ తో సహా మరో నలుగురి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు పోలీసులు.

పోలీస్ దొంగను వెంటాడిన వీడియో దిగువన చూడండి

Also Read:Hyderabad: 9 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ఆయా.. 20 ఏళ్ల జైలు శిక్ష



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Ckl0Iu

Related Posts

0 Response to "Viral Video: సినిమాలను తలదన్నే ఛేజింగ్ సీన్‌.. దొంగను పట్టుకునేందుకు పోలీస్‌ పరుగులు"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel