
DGP Mahender Reddy: అసలు ఆ అనుమానాలే అక్కర్లేదు.. రేపిస్ట్ రాజు మృతిపై డీజీపీ కీలక వ్యాఖ్యలు

Saidabad Accused Raju: హైదారాబాద్ సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో చిన్నారి హత్యాచారం కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ కేసులో నిందితుడైన రాజు పోలీసులకు చిక్కకుండానే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటన అనంతరం పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే పట్టుకోని ఇలా చంపారంటూ.. పలువురు పేర్కొంటున్న నేపథ్యంలో.. దీనిపై డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. రాజు ఆత్మహత్య విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని పేర్కొన్నారు. నిన్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న లోకో పైలట్‌లు ఓ వ్యక్తి మృతిచెందడాన్ని గమనించి స్టేషన్‌లో సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే.. రాజును అక్కడ పనిచేసే మరో ఇద్దరు రైల్వే ఉద్యోగులు కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు. పక్కనే ఉన్న రైతులు కూడా ఆత్మహత్యకు సాక్షులని తెలిపారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు సాక్షుల వాంగ్మూలాలను వీడియో రికార్డింగ్ చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అయితే చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలని కోరుతూ పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దంటూ హితవు పలికారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ కీచకుడి కోసం వేలాది మంది పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు రాజు వారం తర్వాత రైల్వే పట్టాలపై శవమై కనిపించిన విషయం తెలిసిందే. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే మార్గంలోని రైల్వే ట్రాక్‌పై అతని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. మృతుడి శరీరంపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read:
Telangana: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ భార్య శారద లొంగుబాటు.. వెల్లడించిన డీజీపీ..
Viral Photos: గణపతికి నైవేద్యంగా గోల్డెన్ ఉండ్రాళ్లు.. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/39hyXug
0 Response to "DGP Mahender Reddy: అసలు ఆ అనుమానాలే అక్కర్లేదు.. రేపిస్ట్ రాజు మృతిపై డీజీపీ కీలక వ్యాఖ్యలు"
Post a Comment