
Minister KTR: కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న మంత్రి కేటీఆర్.. ట్వీట్ చేసి..

Covid-19 vaccine: తెలంగాణ మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. వ్యాక్సినేషన్ రెండో జాబ్ డన్ అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా.. అంతకుముందు కేటీఆర్ జూలై 20న కోవిడ్ టీకా మొదటి మోతాదు తీసుకున్నారు. కాగా.. మొదటి డోస్ తీసుకుంటున్న క్రమంలో ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన వ్యాక్సిన్ ఇచ్చిన వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఫ్రంట్‌లైన్ యోధులైన డాక్టర్ శ్రీ కృష్ణ, నర్స్ కెరినా జ్యోతి, ఆరోగ్య సంరక్షణ కార్మికులందరికీ ధన్యవాదాలంటూ ట్విట్ చేశారు. కాగా.. మంత్రి కేటీఆర్ ఇంటివద్దనే రెండో డోసును తీసుకున్నారు.
Second jab done
#VaccinationUpdate pic.twitter.com/hfMVOZEV3T
— KTR (@KTRTRS) September 17, 2021
తెలంగాణలో నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
ఇదిలాఉంటే.. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 241 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,63,026కి చేరింది. దీంతోపాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 3,902కి చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజు వ్యవధిలో 298 మంది కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 6,53,901కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,223 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది.
Also Read:
DGP Mahender Reddy: అసలు ఆ అనుమానాలే అక్కర్లేదు.. రేపిస్ట్ రాజు మృతిపై డీజీపీ కీలక వ్యాఖ్యలు
Coronavirus: ఆ ఇంజక్షన్‌తో కరోనాను దూరం పెట్టొచ్చు.. కరోనా నిరోధించే మరో మార్గం కనిపెట్టిన పరిశోధకులు !
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Cp60J8
0 Response to "Minister KTR: కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న మంత్రి కేటీఆర్.. ట్వీట్ చేసి.."
Post a Comment