-->
Ravi Teja: బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్మురేమడానికి రెడీ అవుతున్న మాస్ రాజా…

Ravi Teja: బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్మురేమడానికి రెడీ అవుతున్న మాస్ రాజా…

Raviteja

Ravi Teja: మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉంది. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఖిలాడి సినిమా విడుదల తేదీని గురువారం చిత్రనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా విడుదల చేసిన పోస్టర్‌లో సిగరెట్ తాగుతూ మాస్ లుక్కులో రవితేజ కనిపించారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో విడుదల చేసిన రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.

ప్రొడక్షన్ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియెస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ డిఫరెంట్ రోల్‌ను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాత్ మరో హిట్ రవి తేజ అందుకోవడం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్. ఇదిలా ఉంటే ఖిలాడి సినిమాతో పాటు త్రినాద్ తో కలిసి ధమాకా అనే సినిమా చేస్తున్నాడు మాస్ రాజా.. అలాగే రామారావు ఆన్ డ్యూటీ సినిమా, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కూడా పట్టాలెక్కించాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు రవితేజ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Sirish: సోషల్‌ మీడియాను వీడిన అల్లు శిరీష్‌.. అసలు మ్యాటరేంటంటే..

Divi Vadthya: ఏ ‘దివి’లో విరిసిన పారిజాతమో… బిగ్ బాస్ బ్యూటీ ఫోటోలు వైరల్ 

Anchor Vishnu Priya: తన పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ విష్ణు ప్రియ.. ఇదిగో పోస్ట్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3kvr4Y6

0 Response to "Ravi Teja: బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్మురేమడానికి రెడీ అవుతున్న మాస్ రాజా…"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel