-->
Nani’s Shyam Singha Roy: శ్యామ్ సింగ రాయ్ టీజర్ ఆన్ ది వే.. రిలీజ్ ఎప్పుడంటే..

Nani’s Shyam Singha Roy: శ్యామ్ సింగ రాయ్ టీజర్ ఆన్ ది వే.. రిలీజ్ ఎప్పుడంటే..

Nani

Nani’s Shyam Singha Roy: న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. రైజ్ ఆఫ్ శ్యామ్ అంటూ ఈ మధ్యే విడుదల చేసిన పాటతో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ ఫస్ట్ సింగిల్‌కు విశేషమైన స్పందన లభించింది. నవంబర్ 18న ఈ మూవీ టీజర్ రాబోతోందని నిర్మాతలు ప్రకటించారు. ఈ సంధర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో నాని తన చేతిలో మండుతున్న కర్రను పట్టుకుని ఉన్నారు. నిప్పు కణికలతో పోస్టర్ పవర్ ఫుల్‌గా మారింది. టీజర్ ఎంతో హై ఇంటెన్స్‌తో ఉండబోతోందని పోస్టర్‌ను బట్టి చూస్తే అర్థమవుతుంది.

కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. భారీ వీఎఫ్ఎక్స్‌తో రాబోతోన్న ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.  రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Nani

Nani

 

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Sirish: సోషల్‌ మీడియాను వీడిన అల్లు శిరీష్‌.. అసలు మ్యాటరేంటంటే..

Divi Vadthya: ఏ ‘దివి’లో విరిసిన పారిజాతమో… బిగ్ బాస్ బ్యూటీ ఫోటోలు వైరల్ 

Anchor Vishnu Priya: తన పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ విష్ణు ప్రియ.. ఇదిగో పోస్ట్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3c5klzs

0 Response to "Nani’s Shyam Singha Roy: శ్యామ్ సింగ రాయ్ టీజర్ ఆన్ ది వే.. రిలీజ్ ఎప్పుడంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel