
Highlights of RCB vs MI Match: హర్షల్ పటేల్ హ్యట్రిక్ దెబ్బకు ముంబై టీం విలవిల.. ఘన విజయంతో మూడో స్థానానికి కోహ్లీసేన

RCB vs MI, IPL 2021: రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు టీం బౌలర్ల ధాటికి ముంబై కుప్పకూలింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై టీం కేవలం 18.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆర్‌సీబీ టీం 10 విజయాలతో 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఈ ఓటమితో ముంబై టీం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.
ముంబై టీంలో ఓపెనర్లు మినహా మరెవరూ రాణించలేక పోవడంతో ఓటమి పాలైంది. రోహిత్ శర్మ 43(28 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్), డికాక్ 24 (23 బంతులు, 4 ఫోర్లు)పరుగులతో రాణించారు. వీరిద్దరూ 57 పరుగుల భాగస్వామ్యం సాధించారు. అయితే వీరిద్దరు పెవలియన్ చేరాక మిగతా బ్యాట్స్‌మెన్స్ క్యూ కట్టారు. ఇషాన్ కిషన్ 9, సూర్య కుమార్ యాదవ్ 8, పాండ్యా 5, పొలార్డ 7, హార్దిక్ పాండ్యా 3, మిలాన్ 0, రాహుల్ చాహర్ 0, బుమ్రా 5 తీవ్రంగా నిరాశ పరిచారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు, చాహల్ 3, మ్యాక్‌వెల్ 2, సిరాజ్ 1 వికెట్ తీసుకున్నారు.
హర్షల్ పటేల్ హ్యాట్రిక్
బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్ 2021 లో హ్యాట్రిక్ సాధించాడు. దీంతో ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్ చేసిన బౌలర్‌గా మారాడు. హర్థిక్ పాండ్య, పొలార్డ్, రాహుల్ చాహర్‌లను పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్ నమోదు చేశాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఆదిలోనే మొదటి వికెట్‌ను కోల్పోయినా.. కెప్టెన్ కోహ్లీ(51), శ్రీకర్ భరత్(32), మ్యాక్స్‌వెల్(56) అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆర్సీబీ 165 పరుగుల భారీ స్కోర్ సాధించగలిగింది. ముంబై గెలవాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులు చేయాల్సి ఉంది.
విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 121 స్ట్రైక్ రేట్‌తో 3 ఫోర్లు, 3 సిక్సుల సహాయంతో అర్థ సెంచరీ సాధించాడు. 15.5 ఓవర్లో మిలాన్ బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు పడిక్కల్ వికెట్‌ను త్వరగా కోల్పియిన ఆర్‌సీబీ, శ్రీకర్ భరత్ వికెట్‌ను 75 పరుగుల వద్ద కోల్పోయింది. అనంతరం మాక్స్‌వెల్ 37బంతుల్లో 151 స్ట్రైక్‌రేట్‌తో 6 ఫోర్లు, 3 సిక్సుల సహాయంతో 56 పరుగులు చేసి, నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం ఏబీడీ 11, అహ్మద్ 1 పరుగులతో నిరాశ పరిచాడు. ఇక ముంబయి బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు, బోల్ట్, మిలాన్, చాహర్ తలో వికెట్ పడగొట్టారు.
WHAT. A. MOMENT for @HarshalPatel23
#VIVOIPL #RCBvMI pic.twitter.com/tQZLzoZmj6
— IndianPremierLeague (@IPL) September 26, 2021
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3m4kR58
0 Response to "Highlights of RCB vs MI Match: హర్షల్ పటేల్ హ్యట్రిక్ దెబ్బకు ముంబై టీం విలవిల.. ఘన విజయంతో మూడో స్థానానికి కోహ్లీసేన"
Post a Comment