-->
Nithiin: పొలిటికల్ అంశాలు హైలెట్‌గా రానున్న “మాచర్ల నియోజకవర్గం”.. నితిన్ ఆశలన్నీ ఈ సినిమా పైనే..

Nithiin: పొలిటికల్ అంశాలు హైలెట్‌గా రానున్న “మాచర్ల నియోజకవర్గం”.. నితిన్ ఆశలన్నీ ఈ సినిమా పైనే..

Nithin

Nithiin: విభిన్న కథలు చేస్తూ అలరిస్తున్న హీరో నితిన్ ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రంలో నితిన్‌ను ఫుల్ యాక్షన్ మోడ్‌లో ప్రేక్షకులు చూడబోతోన్నారు. ఆదిత్య మూవీస్ & ఎంటర్ టైన్మెంట్స్ అసోసియేషన్ తో శ్రేష్ట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మాచర్ల నియోజకవర్గం సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుందని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఎంతో పవర్ ఫుల్‌గా ఉంది. తన మీదకు దాడి చేసేందుకు వస్తోన్న వారిపై నితిన్ విరుచుకుపడుతుండడం ఈ పోస్టర్లో చూడొచ్చు. వేసవి సెలవులను మాచర్ల నియోజకవర్గం కరెక్ట్ గా ఉపయోగించుకోనుంది. ఈ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాలో పొలిటికల్ అంశాలు హైలెట్ కానున్నాయి. కృతి శెట్టి నితిన్ ప్రేమ కథ కూడా కొత్తగా ఉండబోతోంది.

నితిన్‌ను ఇది వరకెన్నడూ చూపించని కొత్త అవతారంలో దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి చూపించబోతోన్నారు. ఇంకా ఈ చిత్రంలో ఎంతో మంది ప్రముఖ నటీనటులున్నారు. అద్భుతమైన సాంకేతిక బృందం ఈ సినిమా కోసం పని చేస్తోంది.  భీష్మ, మాస్ట్రో వంటి చిత్రాల తరువాత మూడోసారి మహతి స్వరసాగర్‌తో కలిసి నితిన్ పని చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్ సినిమా మీద అంచనాలను పెంచింది. ఇదిలా ఉంటే ఇటీవల నితిన్ నటించిన చెక్, రంగ్ దే , మాస్ట్రో సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. రంగ్ దే , మాస్ట్రో పర్లేదు అనిపించుకున్నా.. చెక్ సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది. దాంతో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పైనే ఆశలు పెట్టుకున్నాడు ఈ కుర్రహీరో.

మరిన్ని ఇక్కడ చదవండి.

NTR’s EMK Contestant: సామాన్యుడిని కోటీశ్వరుడు చేసిన తారక్ షో.. తన తెలివితేటలతో దుమ్ము రేపిన పోలీసు…

Manchu Vishnu: కోల్పోయిన దానిని మళ్లీ సాధిస్తానంటోన్న ప్రెసిడెంట్‌ విష్ణు.. ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

Nooran Sisters: విచిత్ర గానంతో.. మీమ్స్‌తో పాపులర్ అయిన ఈ సిస్టర్స్.. రెహ్మాన్ మెచ్చిన గాయనీమణులు అని తెలుసా..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3wIRqKQ

Related Posts

0 Response to "Nithiin: పొలిటికల్ అంశాలు హైలెట్‌గా రానున్న “మాచర్ల నియోజకవర్గం”.. నితిన్ ఆశలన్నీ ఈ సినిమా పైనే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel