
Sobhita Dhulipala : పాత్ర నచ్చితే ఏ భాషలో అయినా చేస్తానంటున్న శోభిత ధూళిపాళ్ల

Sobhita Dhulipala : కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘కురుప్’. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల కథానాయికగా నటించింది. ఇంద్రజిత్ సుకుమారన్, సన్నీ వేస్ కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా సినిమా రాబోతున్న ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత రోహిత్ విడుదల చేశారు. చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మాట్లాడుతూ ఆసక్తిగా విషయాలు తెలిపారు.
“నేను పుట్టి పెరిగింది సంప్రాదయమైన తెలుగు కుటుంబంలో అయినా, నా సినీ ప్రస్థానం మొదలైంది మాత్రం ముంబైలోనే. కాబట్టి నా జర్నీకి స్టార్టింగ్ పాయింట్ బాలీవుడ్ అని చెప్పొచ్చు అన్నారు. నా మనసులో ఎలాంటి బౌండరీలు లేవు. నేను ఏ భాషలో సినిమా చేయాలన్నా కథ బాగా నచ్చాలి. అంతేకానీ ఇది మన భాష కాదనే విషయాన్ని నేను పట్టించుకోను. సినిమాలో నా పాత్ర నన్ను ఇంప్రెస్ చేస్తే ఏ భాషలో అయినా చేసేందుకు నేను రెడీ. ‘కురుప్’లో నా పాత్ర నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది అన్నారు శోభిత.
తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని, బయటి నుంచి వచ్చేవాళ్లకే ఛాన్సులు ఇస్తారనే మాటను నేను నమ్మను. తెలుగులో ఇతర భాషల హీరోయిన్లు వస్తున్న మాట నిజమే. కానీ తెలుగువాళ్లకు అవకాశాలు లేవని నేను చెప్పను. నాకు బయటకంటే ఇక్కడే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. నేను ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నప్పుడు అక్కడి అమ్మాయిలు కూడా మనలాగే అనుకుంటారేమో అని శోభిత అన్నారు.
నేను ఏ సినిమా సెలెక్ట్ చేసుకున్నా.. అందులో నా పాత్ర నిడివి గురించి పట్టించుకోను. నా పాత్రకు తగిన ప్రాధాన్యం ఉందా లేదా అనేదే చూస్తాను. అంటే కూరలో కరివేపాకుల కాకుండా ఉప్పులా ఉండాలి. కూర ఎంత చేసినా ఉప్పులేకపోతే టేస్ట్ ఉండదు కదా. అలా నా పాత్ర ప్రాముఖ్యతను బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను. ‘కురుప్’ డైరెక్టర్ శ్రీనాథ్ ఫ్లాపుల్లో ఉన్నా ఆయన చెప్పిన స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. స్క్రిప్ట్‌లో దమ్ముంటే అదే సినిమాను లాక్కెళ్లిపోతోందని నమ్ముతా. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నా. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు నన్ను మరింతగా ఆదరిస్తానే నమ్మకం ఉంది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందితే అదే గొప్ప అదృష్టం అని చెప్పుకొచ్చారు శోభిత.
మరిన్ని ఇక్కడ చదవండి.
NTR’s EMK Contestant: సామాన్యుడిని కోటీశ్వరుడు చేసిన తారక్ షో.. తన తెలివితేటలతో దుమ్ము రేపిన పోలీసు…
Manchu Vishnu: కోల్పోయిన దానిని మళ్లీ సాధిస్తానంటోన్న ప్రెసిడెంట్ విష్ణు.. ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్..
Nooran Sisters: విచిత్ర గానంతో.. మీమ్స్‌తో పాపులర్ అయిన ఈ సిస్టర్స్.. రెహ్మాన్ మెచ్చిన గాయనీమణులు అని తెలుసా..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/30jmVQf
0 Response to "Sobhita Dhulipala : పాత్ర నచ్చితే ఏ భాషలో అయినా చేస్తానంటున్న శోభిత ధూళిపాళ్ల"
Post a Comment