-->
Ghani : వరుణ్ తేజ్ సినిమాలో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్.. నదియా లుక్ రిలీజ్ చేసిన “గని” టీమ్..

Ghani : వరుణ్ తేజ్ సినిమాలో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్.. నదియా లుక్ రిలీజ్ చేసిన “గని” టీమ్..

Nadhiya

Ghani : మెగా హీరో వరుణ్ తేజ్ ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. తొలిప్రేమ సినిమా సక్సెస్ తర్వాత ఈ కుర్ర హీరో ఎంచుకుంటున్న కథలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గద్దల కొండ గణేష్ సినిమా చేశాడు. ఈ సినిమాలో వరుణ్ యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు గని గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గద్దల కొండ గణేష్ సినిమా తర్వాత వరుణ్ తేజ్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాడు ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘గని’ ఒకటి. గని సినిమాను అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు కీలక పాత్రలలో నటించనున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయూ మంజ్రేకర్ హీరోయిన్‏గా నటిస్తుంది. కరోనా కారణంగా ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లినప్పటికీ, పక్కా ప్లానింగుతో షూటింగు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమానుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుంది. తాజాగా గని సినిమానుంచి సీనియర్ నటి నదియా లుక్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె మాధురి అనే పాత్ర పోషించిందనే విషయాన్ని వెల్లడించారు చిత్రయూనిట్. ఈ నదియా కీలక పాత్రలో కనిపించనుందని పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతోంది. ఇక  నవంబర్ 15న గని టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Nadiya

మరిన్ని ఇక్కడ చదవండి.

NTR’s EMK Contestant: సామాన్యుడిని కోటీశ్వరుడు చేసిన తారక్ షో.. తన తెలివితేటలతో దుమ్ము రేపిన పోలీసు…

Manchu Vishnu: కోల్పోయిన దానిని మళ్లీ సాధిస్తానంటోన్న ప్రెసిడెంట్‌ విష్ణు.. ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

Nooran Sisters: విచిత్ర గానంతో.. మీమ్స్‌తో పాపులర్ అయిన ఈ సిస్టర్స్.. రెహ్మాన్ మెచ్చిన గాయనీమణులు అని తెలుసా..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/31Xbhee

Related Posts

0 Response to "Ghani : వరుణ్ తేజ్ సినిమాలో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్.. నదియా లుక్ రిలీజ్ చేసిన “గని” టీమ్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel