
PM Modi: నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రధాని మోదీ

PM Modi: అమెరికా పర్యటన ముగించుకుని భారత్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి నూతన పార్లమెంట్ భవన పనులను పరిశీలించారు. సుమారు గంట పాటు అక్కడే ఉండి జరుగుతున్న పనులపై మోదీ ఆరా తీశారు. భవన నిర్మాణ పనులకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు జరుగుతున్న నిర్మాణాలు, సుందరీకరణ పనులను మోదీ పరిశీలించారు.
కాగా, డిసెంబర్ 10, 2020న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవనం నిర్మాణం అవుతోంది. 2022 నాటికి పూర్తి కానుంది.
ఈ భవనంలో లోక్‌సభలో 888 మంది ఎంపీలకు, రాజ్యసభలో 384 మంది ఎంపీలకు కేటాయించనున్నారు. ఈ భవనంలో 1,382 మంది ఉండేందుకు నిర్మాణం జరుగుతోంది.
భవన నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. పనులు కొనసాగుతున్న తీరుపై మోదీ ఆరా తీశారు.
ఇవీ కూడా చదవండి:
PM Narendra Modi: బడలిక ఎరుగని ప్రధాని మోడీ.. అలసట దరిచేరక పోవడానికి రహస్యం ఇదే!
Punjab New Cabinet: పంజాబ్ లో కొలువు తీరిన కొత్త మంత్రివర్గం..చన్నీ బృందంలో చేరిన 15 మంది!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3kGnA5l
0 Response to "PM Modi: నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రధాని మోదీ"
Post a Comment