
Anand Mahindra: భారతీయుల అల్పాహారాన్ని తక్కువ అంచనా వేయకండి.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా.. ఆయన తన ఆలోచనలను ఎప్పుడూ ప్రజలతో పంచుకుంటారు. ఆయన అనుచరులు కూడా కామెంట్లతో తెగ వైరల్ చేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహేంద్ర కెల్లాగ్ ఉప్మా గురించి ఓ పాత కథనాన్ని పంచుకున్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అమెరికన్ కంపెనీ కెల్లోగ్ భారతదేశానికి వచ్చినప్పుడు భారతీయుల అల్పాహార అలవాట్లను మార్చాలని సవాలు చేశారట. అయితే, ఇండియన్స్ అల్పాహార అలవాట్లు మారలేదు కానీ, కెల్లాగ్స్ తన ఆహార ఉత్పత్తిని మార్చాల్సి వచ్చింది. ఈ మీమ్‌ను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ‘కెల్లోగ్స్ భారతదేశానికి వచ్చారు. భారతీయుల అల్పాహారం, అలవాట్లను పూర్తిగా మార్చుతామంటూ సవాలు చేశారు. కానీ, 10 సంవత్సరాల్లో కెల్లోగ్సే మారిపోయింది” అంటూ రాసుకొచ్చారు. ఇప్పడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వందల సంఖ్యలో రీ ట్వీట్‌లు చేస్తున్నారు. 12 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. మా ఆహార అలవాట్లను ఎవరూ మార్చలేరంటూ కామెంట్స్ చేస్తున్నారు. మా అల్పాహారాలకు మరేవీ సాటిరావంటున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Rabindranath Tagore villa: అమ్మకానికి రవీంద్రనాథ్ ఠాగూర్ విల్లా..! లండన్‌లో కొంత కాలం నివాసం ఉన్న సాహితీవేత్త..!(వీడియో)
జాతిరత్నాలు డైరెక్టర్ దర్శకత్వంలో వెంకీమామ..! ఈ సారి ఓ రేంజ్ లో ఫన్ రిపీట్..(వీడియో)
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2W83asL
0 Response to "Anand Mahindra: భారతీయుల అల్పాహారాన్ని తక్కువ అంచనా వేయకండి.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్..!"
Post a Comment