-->
Sonusood: ఆపద్బాంధవుడి కంట కన్నీరు..! శక్తి మేరకు సేవ చేయాలనుకున్నా..(వీడియో)

Sonusood: ఆపద్బాంధవుడి కంట కన్నీరు..! శక్తి మేరకు సేవ చేయాలనుకున్నా..(వీడియో)

Sonusood Emotional Reaction On It Returns Video

సోనూసూద్‌.. దేశం నలుమూలలా ఈ పేరు తెలియని వారుండరు. కరోనా కష్ట కాలంలో ప్రాంతాలతో సంబంధం లేకుడా కష్టంలో ఉన్న అందరినీ ఆదుకున్నారు. ఆపదలో ఉన్న వారికి అపద్బాంధవుడుగా మారారు. కష్టాల్లో ఉన్న ప్రతి వ్యక్తి చూపు ఇప్పుడు సోనూసూద్‌ వైపే చూస్తోంది. కాగా ఇటీవల సోనూసూద్‌ నివాసం, కర్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో సోనూసూద్‌ 20 కోట్ల రూపాయలు పన్ను ఎగవేశారని తేల్చారు.

కాగా ఆదాయపన్ను శాఖ సోదా లపై సోనూసూద్‌ తొలిసారి స్పందించా రు. తన ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయీ ఓ విలువైన ప్రాణాన్ని నిలబెట్టేందుకు, ఆర్తులకు సాయం చేసేందుకే ఎదురుచూస్తోందన్నారు. మన నిజాయితీ గురించి మనం ప్రతిసారీ చెప్పుకోవాల్సిన పనిలేదని, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని ఆయన భావోద్వేగంతో కూడిన ఓ సందేశాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు. ‘‘4 రోజులుగా కొందరు ‘అతిథులతో’ బిజీగా ఉండడంతో మీ సేవకు దూరమయ్యాను. నాకు రెండు పార్టీలు రాజ్యసభ సీటును ఆఫర్‌ చేశాయి. మానసికంగా సిద్ధంగా లేకపోవడంతో తిరస్కరించాను. రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే చెప్పలేను. ఆ దిశగా నిర్ణయం తీసుకున్నప్పుడు నేనే వెల్లడిస్తాను’’ అని సోనూసూద్‌ చెప్పారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Anand Mahindra: భారతీయుల అల్పాహారాన్ని తక్కువ అంచనా వేయకండి.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

 Rabindranath Tagore villa: అమ్మకానికి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ విల్లా..! లండన్‌లో కొంత కాలం నివాసం ఉన్న సాహితీవేత్త..!(వీడియో)

 Worlds Oldest Twins Video: ప్రపంచ కవలల్లో అత్యంత వృద్ధులు వీరే..! చిన్నతనంలో విడిపోయిన తోబుట్టువులు..!(వీడియో)

 Payal Ghosh injured Video: నాపై యాసిడ్ , ఇనుప రాడ్లతో దాడి చేశారు.. నటి పాయల్ సంచలన వ్యాఖ్యలు..!(వీడియో)



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2XFrum4

0 Response to "Sonusood: ఆపద్బాంధవుడి కంట కన్నీరు..! శక్తి మేరకు సేవ చేయాలనుకున్నా..(వీడియో)"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel