-->
Prabhu Deva: ప్రభుదేవా సంచలన నిర్ణయం.. అభిమానులు షాక్‌..! కారణం ఆ హీరోనేనా..(వీడియో)

Prabhu Deva: ప్రభుదేవా సంచలన నిర్ణయం.. అభిమానులు షాక్‌..! కారణం ఆ హీరోనేనా..(వీడియో)

Shocking News For Prabhu Deva Fans With He Sensational Decision Video

సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రభుదేవా ఒకరు. కొరియోగ్రాఫర్‌‌గా అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్న ప్రభుదేవాను ఇండియా మైకేల్ జాక్సన్‌గా పిలుచుకుంటారు అభిమానులు. ఆయన కొరియోగ్రాఫర్‌గానే కాకుండా నటుడిగాను సక్సెస్ అయ్యారు. ప్రభుదేవా హీరోగా పలు సినిమాలు వచ్చాయి. ఇటు దర్శకుడిగాను మంచి సక్సెస్ సాధించారు ప్రభుదేవా. తెలుగులో ఆయన ఎమ్మెస్ రాజు బ్యానర్లో రెండు సినిమాలు చేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్టూ అక్కడ బిజీ డైరెక్టర్‌గా మారారు. తెలుగు సినిమాలను అక్కడి టాప్ హీరోలతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందుకున్నారు ప్రభుదేవా. ఇక ప్రభుదేవా దర్శకుడిగా మారిన తర్వాత కొరియోగ్రాఫర్‌గా ఒకరిద్దరు హీరోలకు మాత్రమే డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ మధ్య ప్రభుదేవా దర్శకత్వం వహించిన సినిమాలు అంతా ప్రేక్షకాదరణ పొందలేకపోతున్నాయి.

ప్రభుదేవా సల్మాన్ ఖాన్‌తో చేసిన రాధే సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. దాంతో ఆయన తిరిగి చెన్నైకు చేరుకున్నారు. ఇక పై డైరెక్షన్‌కి గుడ్‌బై చెప్పి నటన పైనే పూర్తి దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. నటుడిగా అవకాశాలు బాగా వస్తున్నాయని, అందుకే ఆయన ఈ నిర్ణయానికి వచ్చారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుదేవా భగీరా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో విడుదల కానుంది.

మరిన్ని చదవండి ఇక్కడ : Sonusood: ఆపద్బాంధవుడి కంట కన్నీరు..! శక్తి మేరకు సేవ చేయాలనుకున్నా..(వీడియో)

 Anand Mahindra: భారతీయుల అల్పాహారాన్ని తక్కువ అంచనా వేయకండి.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

 Rabindranath Tagore villa: అమ్మకానికి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ విల్లా..! లండన్‌లో కొంత కాలం నివాసం ఉన్న సాహితీవేత్త..!(వీడియో)

 Worlds Oldest Twins Video: ప్రపంచ కవలల్లో అత్యంత వృద్ధులు వీరే..! చిన్నతనంలో విడిపోయిన తోబుట్టువులు..!(వీడియో)



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lZ3brY

Related Posts

0 Response to "Prabhu Deva: ప్రభుదేవా సంచలన నిర్ణయం.. అభిమానులు షాక్‌..! కారణం ఆ హీరోనేనా..(వీడియో)"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel