
Viral Video: పిల్లాడి కంటే ముందే ‘అమ్మా’ అనేసిన పెంపుడు కుక్క.. వీడియో చూస్తే నవ్వుల పువ్వులే..!

Viral Video: ఏదో కొద్ది మంది మినహా.. కుక్కలను ఇష్టపడని వారు ఉండరు. అవి ముద్దు ముద్దుగా చేసే అల్లరి, వాటి ప్రేమ, అవి చూపే కేరింగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాదు.. కుక్కలు మనుషుల్లాగే తెలివైనవి కూడా. తాజాగా ఓ పెంపుడు కుక్క అతి తెలివికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హృదయానికి హత్తుకునేలా ఉన్న ఈ వీడియో చూస్తే మీరు కూడా నిజంగా షాక్ అవుతారు.
గుడ్ న్యూస్ కరస్పాండెంట్ ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసిన వీడియోలో ఒక పిల్లాడు, కుక్క పక్కపక్కనే కూర్చున్నారు. పక్కనే పిల్లాడి తల్లిదండ్రులు.. ఆ చిన్నోడిచే ‘అమ్మా’ అని పలికించడం కోసం ప్రయత్నిస్తున్నారు. గోరు ముద్దలు తినిపిస్తూ.. అమ్మా అని పలికేలా ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ, ఆ బుడతడు అమ్మా అనక ముందే.. పక్కనే కుక్క అమ్మా అని పిలిచి ఆశ్చర్యానికి గురి చేసింది. కుక్క ఒక్కసారిగా అలా అనడంతో ఆ తల్లిదండ్రులు ఆనందతో ఉబ్బితబ్బి్బ్బైపోయారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన వీరు.. ‘‘పిల్లల తల్లిదండ్రులు తమ బిడ్డను ‘అమ్మా’ అని పిలవడానికి ట్రైనింగ్ ఇస్తున్నారు. పిల్లాడి కంటే ముందు కుక్క అమ్మా అని చెప్పడం వారి ఆనందాన్ని మరింత పెంచింది. అది చాలా తెలివైన కుక్క.’’ అంటూ క్యాప్షన్ పెట్టారు.
కాగా, ఈ వీడియోను 2.2 లక్షల నెటిజన్లు వీక్షించగా.. 6 వేలకు పైగా లైక్స్, వందలాది కామెంట్స్ వచ్చాయి. ఆ కుక్క తెలివిని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కుక్క చాలా తెలివిగా గుర్తించిందని కితాబిస్తున్నారు. ప్రతి బిడ్డ కుక్క మాదిరిగా త్వరగా గుర్తించాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. మరెందుకు ఆలస్యం.. ఈ వైరల్ వీడియోను మీరూ చూసేయండి.
Viral Video:
Mom & dad are trying to get their baby to say “mama” & “more”. Instead, they burst out laughing when their dog says it first. That’s one smart puppy!
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) November 24, 2021
Also read:
Vikram: మళ్లీ పట్టాలెక్కిన కోబ్రా షూటింగ్.. సినిమా విడుదల ఎప్పుడంటే..
Indian Oil: ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/32pkHze
0 Response to "Viral Video: పిల్లాడి కంటే ముందే ‘అమ్మా’ అనేసిన పెంపుడు కుక్క.. వీడియో చూస్తే నవ్వుల పువ్వులే..!"
Post a Comment