DRDO Recruitment 2021: DRDOలో అప్రెంటీస్ ఖాళీలు.. ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక.. పూర్తి వివరాలివే..

DRDO Recruitment 2021: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) డిప్లొమా అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. DRDO లో అంతర్భాగమైన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ (DIPAS)లో ఈ నియామకాలు చేపడుతున్నారు. ఈ పోస్టుల కోసం డిప్లొమా కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. DRDO డిప్లొమా అప్రెంటీస్ జాబ్ నోటిఫికేషన్ 2021, దరఖాస్తుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్ట్ పేరు – డిప్లొమా అప్రెంటిస్..
పోస్టుల సంఖ్య – 12
ఫ్యాకల్టీ..
కంప్యూటర్ ఇంజనీరింగ్ – 02 పోస్టులు
మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ – 04 పోస్టులు
లైబ్రరీ సైన్స్ – 01 పోస్ట్
మెకానికల్ ఇంజనీరింగ్ – 01 పోస్ట్
మోడరన్ ఆఫీస్ ప్రాక్టీస్ అండ్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ – 04 పోస్టులు
పే స్కేల్..
నెలకు రూ.8000. ఇది ప్రాథమిక వేతనం మాత్రమే. దీంతోపాటు డీఏ, ఇంటి అద్దె సహా ఇతర అలవెన్సులు కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఇవ్వనున్నారు.
అర్హతలు..
ఖాళీని బట్టి సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా. ఉదాహరణకు – డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ / మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ / లైబ్రరీ సైన్స్ / మెకానికల్ ఇంజనీరింగ్ / ఆఫీస్ మేనేజ్‌మెంట్.
ఎలా దరఖాస్తు చేయాలి..
ఈ DRDO ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే.. నేషనల్ అప్రెంటిస్‌షిప్ పోర్టల్ వెబ్‌సైట్ mhrdnats.gov.inని సందర్శించాల్సి ఉంటుంది. అనంతరం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్‌ని సబ్మిట్ చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ 15 నవంబర్ 2021 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 14 డిసెంబర్ 2021. దీని కోసం ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాల కోసం డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
Also read:
Vikram: మళ్లీ పట్టాలెక్కిన కోబ్రా షూటింగ్.. సినిమా విడుదల ఎప్పుడంటే..
Indian Oil: ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3FMhp7v


0 Response to "DRDO Recruitment 2021: DRDOలో అప్రెంటీస్ ఖాళీలు.. ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక.. పూర్తి వివరాలివే.."
Post a Comment