
Snake Stuck in Tin: బీర్ టిన్‌లో ఇరుక్కుపోయిన నాగుపాము తల.. ఎలా బయటకు తీశారంటే..!

Viral News: సాధారణంగా జంతువులు ఖాళీ డబ్బాలు, సీసాలు, టైర్లు వంటి వాటిల్లో తల పెట్టడం వల ఒక్కోసారి వాటిల్లో ఇరుక్కుపోయిన ఘటనలను చాలా చూసి ఉంటాం. ఆహారం కోసం వెతుకుతూనో.. నీరు తాగడం కోసం ప్రయత్నిస్తూనో వాటి ఇరుక్కుపోతుంటాయి. పాపం.. తాజాగా ఓ పాము కూడా అలాగే ఇరుక్కుపోయింది. ఎరక్కపోయి.. ఇరుక్కుపోయా అన్నట్లుగా.. దాహం తీర్చుకుందాం అనుకుందో మరేంటో గానీ.. ఓ భారీ నాగుపాము తల ఖాళీ బీర్ టిన్‌లో ఇరుక్కుపోయింది. ఒడిశాలోని పూరీ జిల్లా బొలొంగో ప్రాంతంలోని జితేంద్ర మహాపాత్రో పెరటిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అయితే, టిన్నులో తల ఇరకడంతో ఆ పాము గిల గిల కొట్టుకుంది. తలను బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఎంతకూ రాకపోవడంతో విలవిల్లాడిపోయింది. ఇది గుర్తించిన పలువురు స్థానికులు.. వెంటనే స్నేక్ హెల్ప్ లైన్ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న స్నేక్ క్యాచర్స్.. పాము ఏమాత్రం గాయపడకుండా జాగ్రత్తగా బయటకు తీశారు. ఆ బీర్ టిన్‌ను కత్తిరించి.. పామును సురిక్షతంగా కాపాడారు. ఆ తరువాత పామును బందించి జనసంచారం లేని ప్రాంతంలో విడిచిపెట్టారు.
Also read:
Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?
Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EzyXU8
0 Response to "Snake Stuck in Tin: బీర్ టిన్‌లో ఇరుక్కుపోయిన నాగుపాము తల.. ఎలా బయటకు తీశారంటే..!"
Post a Comment