-->
Corona-Omicron: ఒమిక్రాన్‌ వైరస్‌ను ఎదుర్కొనే కొత్త చికిత్స.. బ్రిటన్‌లో వైద్యుల ముందడుగు..!

Corona-Omicron: ఒమిక్రాన్‌ వైరస్‌ను ఎదుర్కొనే కొత్త చికిత్స.. బ్రిటన్‌లో వైద్యుల ముందడుగు..!

Omicron

Corona-Omicron: ఆయా దేశాల్లో ఇప్పుడిప్పుడే ఎంటర్‌ అవుతున్న ఒమిక్రాన్‌ మహమ్మారికి.. మొదట్లోనే చెక్‌ పెట్టేందుకు రెడీ అవుతున్నాయి ప్రపంచదేశాలు. ఇక తాజాగా కొవిడ్‌-19 రూపాంతరమైన ఒమిక్రాన్‌కు సరికొత్త యాంటీబాడీ చికిత్సను బ్రిటన్‌లోని వైద్య నియంత్రణ సంస్థ ఆమోదించింది. ఇది ఒమిక్రాన్‌ వంటి కొత్త వేరియంట్లపైనా సమర్థంగా పనిచేస్తుండొచ్చని భావిస్తున్నారు ఎంహెచ్‌ఆర్‌ఏ వైద్య అధికారులు. సోత్రోవిమాబ్‌ అనే ఈ ఔషధాన్ని సింగిల్‌ మోనోక్లోనల్‌ యాంటీబాడీలతో తయారుచేసిన్నట్లు తెలిపారు.

కరోనా వైరస్‌పైన ఉండే కొమ్ము ప్రొటీన్‌కు ఇది అంటుకుంటుంది. తద్వారా అది మానవ కణాల్లోకి ప్రవేశించకుండా నిలువరిస్తుందని తెలిపారు ఎంహెచ్‌ఆర్‌ఏ వైద్య అధికారులు. ఇది సురక్షితమైన ఔషధమని, తీవ్రస్థాయి అనారోగ్యం ముప్పున్నవారికి బాగా ఉపయోగపడుతుందని అన్నారు. అయితే ఈ సోత్రోవిమాబ్‌ వ్యాక్సిన్‌ను రక్తనాళాల ద్వారా 30 నిమిషాల పాటు ఇస్తారు. 12 ఏళ్లు పైబడినవారికి కూడా ఇవ్వవచ్చంటా. అంతేకాదు.. ముప్పు అధికంగా ఉండే పెద్ద వయస్సున్న వారిలో వ్యాధి లక్షణాలతో కూడిన కొవిడ్‌ తలెత్తినప్పుడు.. వారు ఆసుపత్రిపాలు కాకుండా, మరణం బారినపడకుండా 79 శాతం మేర ఈ ఔషధం రక్షిస్తుందని క్లినికల్‌ పరీక్షల్లో వెల్లడైంది.

Also read:

14 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 20 నిమిషాల్లో మ్యాచ్ ముగించాడు.. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు దబిడి దిబిడే.!

Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?

IPL 2022: సన్‌రైజర్స్ బిగ్ స్కెచ్.. వార్నర్‌ను రీప్లేస్ చేసేది టీమిండియా టీ20 స్పెషలిస్ట్.. ఎవరో తెలుసా?

Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/32RNOvf

Related Posts

0 Response to "Corona-Omicron: ఒమిక్రాన్‌ వైరస్‌ను ఎదుర్కొనే కొత్త చికిత్స.. బ్రిటన్‌లో వైద్యుల ముందడుగు..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel