-->
Helicopter Crash: ఆకాశంలోనే కాలిబుడిదైన హెలికాప్టర్.. రావత్ ప్రయాణిస్తున్నదేనంటూ..

Helicopter Crash: ఆకాశంలోనే కాలిబుడిదైన హెలికాప్టర్.. రావత్ ప్రయాణిస్తున్నదేనంటూ..

Viral

తమిళనాడులోని కూనురు నీలగిరి కొండల్లో నిన్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆర్మీ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‏తోపాటు అయన భార్య మధులిక.. మరో 11 మంది సైనిక సిబ్బంది కన్నుమూశారు. ఈ విషయాన్ని వాయుసేన అధికారికంగా ప్రకటించింది. హెలికాప్టర్ ప్రమాదాన్ని ప్రత్యేక్షంగా వీక్షించినవారున్నారు. హెలికాప్టర్ కూప్పకూలిన వెంటనే మంటలు రావడంతో అక్కడే ఉన్న స్థానికులు వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే హెలికాప్టర్ పూర్తిగా కాలిపోవడంతో అందులో మరణించిన వారిని గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది. అయితే హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

అయితే రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‏కు ఆకాశంలోనే మంటలు చెలరేగాయని.. ప్రమాద దృశ్యాలు ఇవేనంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఓ హెలికాప్టర్ ఆకాశంలో ఉన్నప్పుడే మంటలు చెలరేగాయి. దీంతో మంటల మధ్యనే దాదాపు రెండు నిమిషాలపాటు హెలికాప్టర్ గాలిలో చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో అందులో ఉన్నవారు కొందరు హెలికాప్టర్ నుంచి దిగే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత గాలిలోనే హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయి నిటారుగా వేగంగా నెలపై పడిపోయింది. అయితే బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదాన్ని ప్రత్యేక్షంగా చూసినవారు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఆకాశంలోనే మంటలు చెలరేగాయని.. అందులో కొందరు హెలికాప్టర్ నుంచి బయటకు దూకేసారని చెబుతున్నారు. దీంతో ఆ హెలికాప్టర్ వీడియో రావత్ ప్రయాణిస్తున్నాదేనంటూ నెట్టింట్లో ప్రచారం మొదలైంది.

కానీ నిజానికి ఆ వీడియో ఇప్పటిది కాదు. 2020 ఫిబ్రవరిలో సిరియాలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో. అక్కడ ఆకాశంలో మంటల్లో చిక్కుకున్నప్పుడు వీడియో తీశారు. అయితే ఆకాశంలో కాలిపోయిన ఈ హెలికాప్టర్ వీడియో రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాదని మరికొందరు వాదిస్తున్నారు.

వీడియో..

Also Read: Upasana: జీవితంలోనే ప్రత్యేకమైన రోజు.. చెల్లెలు పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన ఉపాసన.. రాయల్ ‏లుక్‏లో చరణ్..

Bigg Boss 5 Telugu: సిరిని కంటిచూపుతోనే కంట్రోల్ చేస్తున్న షణ్ముఖ్ ?.. ఫైర్ అవుతూనే ఆమె తల్లిని కూడా..

Simbu: మెగా ప్రొడ్యూసర్‌ చేతికి మరో హిట్ సినిమా రీమేక్ హక్కులు !.. మెగా హీరోలతోనే తెరకెక్కించే ఛాన్స్‌!

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3pCrAW1

Related Posts

0 Response to "Helicopter Crash: ఆకాశంలోనే కాలిబుడిదైన హెలికాప్టర్.. రావత్ ప్రయాణిస్తున్నదేనంటూ.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel