-->
Gold Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధర.. తాజా పసిడి రేట్లు ఇలా ఉన్నాయి..!

Gold Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధర.. తాజా పసిడి రేట్లు ఇలా ఉన్నాయి..!

Gold

Gold Price Today: గత రెండు, మూడు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర.. తాజాగా పెరిగింది. రెండు, మూడు రోజుల నుంచి కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉంది. ఇక కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలతో బంగారం ధరలపై అధిక ప్రభావం చూపుతుందని, దీని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారం (డిసెంబర్‌ 9)న దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు నమోదైనవి మాత్రమే. మళ్లీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఒక వేళ తగ్గవచ్చు.. లేదా పెరగొచ్చు.

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,100 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,390 వద్ద ఉంది.

* ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,840 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,840 వద్ద కొనసాగుతోంది.

* ఇక తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,220ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,330 వద్ద కొనసాగుతోంది.

* ఇక పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 వద్ద కొనసాగుతోంది.

* అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 ఉంది.

* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

* ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.

* అలాగే ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.

* విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.

అయితే ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకు కారణం లేకపోలేదు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Rs 2000 Notes: క్రమంగా తగ్గిపోతున్న 2000 రూపాయల నోట్ల చలామణి.. నిలిచిపోయిన ముద్రణ.. నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ

RBI Monetary Policy: ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. యథాతథంగా కీలక వడ్డీ రేట్లు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3DDeZXp

Related Posts

0 Response to "Gold Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధర.. తాజా పసిడి రేట్లు ఇలా ఉన్నాయి..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel